స్కిల్ వర్సిటీ నిర్మాణానికి ముందుకొచ్చిన మెఘా.. ప్రభుత్వంతో ఎంవోయూ

స్కిల్ వర్సిటీ నిర్మాణానికి ముందుకొచ్చిన మెఘా.. ప్రభుత్వంతో ఎంవోయూ

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మేఘా కంపెనీ ఎండీ కృష్ణా రెడ్డి భేటీ అయ్యారు. స్కిల్ వర్సిటీ నిర్మాణానికి మెఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ ముందుకొచ్చింది. సీఎస్ఆర్ నిధుల నుంచి రూ.200 కోట్లతో మెఘా సంస్థ స్కిల్ వర్సిటీ నిర్మించనుంది.

స్కిల్ వర్సిటీ నిర్మాణం కోసం రేవంత్ సర్కార్ తో మెఘా కంపెనీ ఎంవోయూ చేసుకుని వర్క్ షాపులు, అకడమిక్ బిల్డింగ్, క్లాస్ రూమ్స్, హాస్టల్ బిల్డింగ్ నిర్మించనుంది. స్కిల్ వర్సిటీ భవన డిజైన్లకు వారం రోజుల్లో తుది రూపు ఇవ్వాలని సీఎం ఆదేశించారు. నవంబర్ 8 నుంచి స్కిల్ వర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు.

స్కిల్ యూనివర్సిటీలో పారిశ్రామికవేత్తలు భాగస్వామ్యం కావాలని, వర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసేందుకు నిధులివ్వాలని సీఎం కోరిన సంగతి తెలిసిందే. యువతకు నైపుణ్యాలు నేర్పించి, ఉపాధి కల్పించేందుకు తమవంతు సహకారం అందించాలని సీఎం ఇప్పటికే పిలుపునిచ్చారు. స్కిల్ యూనివర్సిటీలో దాదాపు 20 కోర్సులను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ALSO READ | రహదారుల నిర్మాణం స్పీడప్ చేయండి: మంత్రి కోమటిరెడ్డి