ఖమ్మం జిల్లాలో పది సీట్లు గెలుస్తాం : మేకల మల్లి బాబు యాదవ్

కామేపల్లి, వెలుగు:  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్  అన్నారు.  శుక్రవారం  పండితాపురంలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది సీట్లు  గెలుస్తామన్నారు.

పార్టీ గెలవబోతుందని  ఎగ్జిట్ పోల్ సర్వేలో తేలిందని తెలిపారు.  కార్యక్రమంలో బానోతు కస్తూరి బాయి నరసింహ నాయక్,  ధరావత్ లాలు,  భూక్యా నాగేంద్రబాబు,  పాటిబండ్ల ప్రసాద్,  మేకల మల్లికార్జునరావు, డేరంగుల తిరుపయ్య, బండి ఉపేందర్, చల్లా మల్లయ్య, తురక భిక్షం, బాదావత్ నాగరాజు, దొడ్డ వేణు మేకల లక్ష్మీనారాయణ, చల్లా  నాగేశ్వరరావు, బానోతు లక్ష్మా, చల్లా మల్లయ్య, బండి నాగరాజు భానోత్ వీరనాగులు, రవి, వీరన్న తదితరులు పాల్గొన్నారు.