ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి : మేకపోతుల వెంకటరమణ

ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి  : మేకపోతుల వెంకటరమణ

సూర్యాపేట, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం​ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల వెంకటరమణ డిమాండ్​చేశారు. మంగళవారం సూర్యాపేటలోని ప్రజా భవనంలో జిల్లా అధ్యక్షుడు గోవిందు అధ్యక్షతన కల్లుగీత కార్మిక సంఘం ఆఫీస్ బేరర్​సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కల్లుగీత వృత్తిలో ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాష్ట్ర బడ్జెట్​లో గీత కార్మికుల సంక్షేమం కోసం కేటాయించిన డబ్బులతో హైదరాబాద్​లోని నెక్లెస్ రోడ్ లో నీరా కేఫ్ నిర్మించారని తెలిపారు. 

ఇది రాష్ట్ర గీత కార్మికులందరి ఆస్తి అని, కానీ టూరిజంశాఖ ఆధీనంలో ఉండడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే టాడీ కార్పొరేషన్ కు అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి జిల్లాలో నీరా, తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు పెట్టి యువతకు ఉపాధి కల్పించాలన్నారు. సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి అంజిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు అబ్బగాని భిక్షం, తుమ్మల సైదయ్య గుణగంటి కృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి నగేశ్ పాల్గొన్నారు.