2021లో ఆఫ్ఘనిస్తాన్పై తాలిబాన్ నియంత్రణను చేపట్టినప్పటి నుండి ఆ దేశంలో ప్రజల పరిస్థితి అత్యంత దీనంగా మారింది. జనాలు, ముఖ్యంగా ఆడవాళ్లు భయంతో బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. గతంలో 90ల్లో అఫ్గాన్‌ను తమ గుప్పెట్లో పెట్టుకుని పాలించిన తాలిబన్లు.. ఆ సమయంలో ఆడపిల్లల చదువులపై నిషేధం పెట్టారు. మళ్లీ తాలిబన్ రాజ్యం రావడంతో దేశం వదిలి పారిపోవాలని ప్రయత్నిస్తున్నారు. దేశంలో ఉన్న వాళ్లు తమ మానప్రాణాలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.
2021 లో మహిళలు క్రికెట్ ఆడేందుకు వీలు లేదని కఠినంగా పరిమితులు విధించింది. 2021లో దేశంలో మహిళల క్రికెట్‌ను తాలిబాన్ నిషేధించింది. మహిళా క్రికెట్ జెర్సీలను కాల్చి వేయడం అత్యంత బాధాకరం. నాలుగేళ్ల క్రితం అత్యంత దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్న తర్వాత అదే సంవత్సరం (2021) ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్లకు విముక్తి లభించింది. వీరు తాలిబన్ల కళ్లుగప్పి ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ మెల్ జోన్స్ సహాయంతో మొత్తం 19 మంది ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్లతో పాటు వారి కోచ్‌లు, కుటుంబాలు ఆస్ట్రేలియా చేరుకున్నారు.
మెల్ జోన్స్ 19 మంది ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్లు వారి కుటుంబ సభ్యులు ఆఫ్ఘనిస్తాన్ నుండి పారిపోవడానికి ఎలా సహాయం చేశారో వివరించింది. 2021లో తాలిబన్ ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ఏ క్రీడను ఆడకూడదని నిషేధం విధించింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ మహిళా జట్టుకు చెందిన 19 మంది కాంట్రాక్ట్ క్రికెటర్ల భవిష్యత్తు అస్తవ్యస్తంగా మారింది. COVID-19 కారణంగా, జోన్స్ మెల్బోర్న్లోని ఒక హోటల్లో ఉన్నప్పుడు ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ బెనాఫ్షా హషిమిని సంప్రదించి.. మీ ఆఫ్ఘనిస్తాన్ జట్టు దేశం విడిచి వెళ్లాలనుకుంటున్నారా అని అడిగారు.
నిర్బంధంలో ఉన్నప్పుడు, ఆమె దేశ మహిళా జట్టులో భాగమైన ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ బెనాఫ్షా హషిమిని సంప్రదించి, ఆమె మరియు ఆమె ఇతర సహచరులు తమ దేశం విడిచి వెళ్లాలనుకుంటున్నారా అని అడిగి మొదట ఆఫ్ఘనిస్తాన్ నుంచి పాకిస్థాన్ కు ఆ తర్వాత ఆస్ట్రేలియా చేరుకున్నారు. ఆస్ట్రేలియాకు వెళ్లిన మహిళా ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు గురువారం (జనవరి 30) మ్యాచ్ ఆడబోతున్నారు. మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో క్రికెట్ వితౌట్ బోర్డర్స్ ఎలెవన్‌తో అఫ్గానిస్థాన్ మహిళల ఎలెవన్ జట్టు ఎగ్జిబిషన్ టీ20 మ్యాచ్ ఆడబోతోంది.