మెల్బోర్న్ ముస్తాబవుతోంది. టీ20 వరల్డ్ కప్లో భాగంగా అక్టోబర్ 23న రెండు జట్లు తలపడబోతున్నాయి. ఈ భీకర పోరుకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఆతిధ్యం ఇవ్వబోతుంది. ఈ నేపథ్యంలో హైఓల్టేజ్ మ్యాచ్ కోసం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో సన్నాహాలు ప్రారంభమయ్యాయి.
టీమిండియా టీ20 వరల్డ్ కప్ను అక్టోబర్ 23న ప్రారంభించనుంది. పాక్తో మొదటి మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలో మెల్బోర్న్ క్రికెట్ స్టేడియాన్ని గ్రౌండ్ సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ట్విట్టర్ లో MCG షేర్ చేసింది."అలాగే... క్రికెట్ లోడ్ అవుతోంది" అని కామెంట్ చేసింది.
మహిళల జట్టు విజయం..
ఈ ఏడాది పాకిస్థాన్తో టీమిండియా మూడు మ్యాచ్లు ఆడింది. మొదటగా భారత ఉమెన్స్ టీమ్ కామన్వెల్త్ గేమ్స్లో తలపడింది. జూలై 31 జరిగిన ఈ మ్యాచ్లో భారత మహిళల జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్..18 ఓవర్లలో కేవలం 99 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో స్నేహ రానా స్పిన్ 2 వికెట్లు తీసుకుంది. 100 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 11.4 ఓవర్లలోనే 8 వికెట్లు కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని అందుకుంది. స్మృతి మంధాన 42 బంతుల్లో 63* పరుగులు చేసింది. ఆ తర్వాత CWG 2022లో క్రికెట్‌లో భారత్ సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది.
ఒకటి గెలుపు మరోటి ఓటమి
ఆసియా కప్ 2022లో భారత మెన్స్ టీమ్ పాకిస్థాన్ తో రెండు సార్లు తలపడింది. ఆగస్టు 28న జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 19.5 ఓవర్లలో 147 పరుగులే చేసింది. ఆ తర్వాత 148 పరుగుల ఛేదనలో భారత్ ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్‌ల వికెట్లను కోల్పోయింది, అయితే విరాట్ కోహ్లి , రవీంద్ర జడేజా హార్దిక్ పాండ్యా రాణించడంతో భారత్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. ఆ తర్వాత గ్రూప్ 4 లో భాగంగా సెప్టెంబర్ 4న ఇరు జట్లు మరోసారి తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్..20 ఓవర్లలో 7 వికెట్లకు 181 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ 28, రోహిత్ శర్మ 28 పరుగులు చేశారు. కోహ్లి 44 బంతుల్లో 60 పరుగులు సాధించాడు. ఆ తర్వాత 182 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన పాక్..19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రిజ్వాన్ 71 హాఫ్ సెంచరీ సాధించగా.., ఆల్‌రౌండర్ మహ్మద్ నవాజ్ 42 రన్స్ చేశాడు. ఈ ఓటమి టీమిండియాను ఆసియాకప్ నుంచి నిష్క్రమించేలా చేసింది. ఆ తర్వాత లంక చేతిలో ఓడి..భారత్ టైటిల్ పోరు నుంచి తప్పుకుంది.
ప్రతీకారం తీర్చుకుంటుందా..?
ఆసియాకప్ లో పాక్ చేతిలో ఎదురైన పరాభవానికి భారత్..ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. అలాగే గతేడాది టీ20 వరల్డ్ కప్ లో భారత్ పాక్ చేతిలో దారుణంగా ఓడిపోయింది. ఈ నేపథ్యంలో ఈ రెండు ఓటములకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవాలని భారత ఆటగాళ్లు కృతనిశ్చయంతో ఉన్నారు. అందుకు టీ20 వరల్డ్ కప్ 2022 వేదిక అని భావిస్తున్నారు. దీంతో మెల్ బోర్న్ లో దాయాదుల పోరు రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది.
టీ20 వరల్డ్‌కప్ కోసం టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్, దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చహల్,అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్