ఇండ్ల స్థలాల కేటాయింపులో జాప్యం వద్దు

  • సీఎం రేవంత్​కు గ్రేటర్ జర్నలిస్టుల సొసైటీ విజ్ఞప్తి

హైదరాబాద్ సిటీ, వెలుగు: జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయించే విషయంలో ఆలస్యం చేయొద్దని గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో- ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ సభ్యులు సీఎం రేవంత్​రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఇండ్ల స్థలాల విషయంలో గత ప్రభుత్వం నమ్మబలికి జర్నలిస్టులకు అన్యాయం చేసిందన్నారు. గురువారం హైదరాబాద్ లో గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో- ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సమావేశం జరిగింది. 

ఈ సమావేశంలో జర్నలిస్టుల ఇండ్ల  స్థలాల సమస్య, ప్రభుత్వ విధానం, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించి పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇటీవల జర్నలిస్టుల ఇండ్లస్థలాల సమస్యపై సీఎం మాట్లాడిన తీరు యావత్ జర్నలిస్టులను నిరాశకు గురి చేసిందన్నారు. తాము రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని సీఎం అనడం సరికాదన్నారు.