
కొమురవెల్లి, వెలుగు: సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్చైర్మన్ లక్ష్మారెడ్డి, కమిటీ సభ్యులు శనివారం దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. స్వామివారి ప్రసాదం అందజేసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం జనగామ జిల్లా డీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డిని కలిసి ఆలయ అభివృద్ధికి సహకరించాలన్నారు.
ఈ సందర్భంగా టెంపుల్ చైర్మన్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించాలని, పార్కింగ్ ప్రదేశాల నుంచి ఆలయం వరకు ఎలక్ట్రిక్ ఆటోలు ఏర్పాటు చేయించాలని మంత్రిని కోరామన్నారు. దాతల సహకారంతో 120 గదులు నిర్మించాలని మంత్రికి విన్నవించగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు అల్లం శ్రీనివాస్, ముస్త్యాల దామోదర్, తాళ్లపల్లి రమేశ్, లింగంపల్లి శ్రీనివాస్, మేడికుంట శ్రీనివాస్, కాంగ్రెస్ నేత మహాదేవుడి శ్రీనివాస్ పాల్గొన్నారు.