రెక్కీ కోసం వచ్చి అడ్డంగా దొరికాడు.. చెడ్డీగ్యాంగ్ ముఠా కోసం పోలీసుల వేట

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణంలో చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యులు రెక్కీ నిర్వహించారు. తాళం వేసి ఉన్న ఇండ్లను పరిశీలించారు. జేపీ కాలనీలోని గీతాసదన్ అపార్ట్ మెంట్ వద్ద రెక్కీ నిర్వహించడానికి వచ్చారు నలుగురు చెడ్డీగ్యాంగ్ దొంగలు. 

అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న వారు అలెర్ట్ కావడంతో ముగ్గురు పారిపోయారు. ఒక వ్యక్తి మాత్రం బాత్రూమ్ లో దాక్కుని దొరికిపోయాడు. పట్టుబడ్డ వ్యక్తిని స్థానికులు చితకబాదారు. అతడి వద్ద నుంచి పలు వివరాలు సేకరించారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. రెక్కీ కోసం వచ్చిన వారంతా బీహార్ కు చెందిన వారుగా తెలుస్తోంది.