కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూ.577.52 కోట్లు

  • హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బల్దియా బడ్జెట్ మీటింగ్
  • సమస్యలపై నిలదీసిన సభ్యులు 

కరీంనగర్ టౌన్,వెలుగు: 2024–25 ఏడాదిగానూ రూ.577.52కోట్లతో కరీంనగర్ బల్దియా బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. బుధవారం బల్దియా ఆఫీసులో మేయర్​ సునీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు అధ్యక్షతన బడ్జెట్ మీటింగ్ జరిగింది. ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా 488.63కోట్లు, ట్యాక్సుల ద్వారా రూ.38.52కోట్లు, పట్టణ ప్రణాళిక ద్వారా రూ.27.35కోట్లు, అద్దెలతో రూ. 7.07కోట్లు సహా మొత్తం రూ.577.52కోట్ల ఆదాయం రానుందని బడ్జెట్‌‌‌‌లో పేర్కొన్నారు.

మీటింగ్​లో కార్పొరేటర్లు సిటీలోని పలు సమస్యలపై అధికారులను నిలదీశారు.  బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేటర్ల భూకబ్జాలు, అవినీతిపై ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించారు. వేసవిలో నీటి ఎద్దడి రాకుండా చర్యలు తీసుకోవాలని మేయర్​ అధికారులను ఆదేశించారు. ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీలో 24టీఎంసీలకు ప్రస్తుతం 10టీఎంసీల నీరే ఉందని సీఈ శంకర్ సభ దృష్టికి తీసుకొచ్చారు. తాగునీరు, ఇతర అవసరాలకు 10 టీఎంసీలు ఉండేలా చూసుకోవాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. 

సమస్యలపై నిలదీత 

అవినీతి, భూకబ్జాల ఆరోపణలతో అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయి జైలుకు వెళ్లిన కార్పొరేటర్లపై ఎలాంటి  చర్యలు తీసుకుంటున్నారని  55వ డివిజన్ కార్పొరేటర్  పెద్దపల్లి జితేందర్(బీజేపీ) ప్రశ్నించారు. ఈక్రమంలో మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  జితేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీవ్ర వాగ్వాదం జరిగింది. 38వ డివిజన్ లో తాగునీటి సమస్య  ఉందని, సంతోషిమాత  టెంపుల్ రోడ్డులో పనులు ప్రారంభించకపోవడంతో  ఇబ్బందులు పడుతున్నామని, వీధిదీపాలు వెలగడం లేదని.. తదితర సమస్యలను పరిష్కరించాలని కార్పొరేటర్ కచ్చురవి(బీజేపీ) డిమాండ్  చేశారు. 

1వ డివిజన్ తీగలగుట్టపల్లిలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని కార్పొరేటర్ శ్రీనివాస్ సూచించారు. మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కలెక్టర్  రాకుండా బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎలా ఆమోదిస్తారని మాజీ  మేయర్, సర్దార్ రవీందర్ సింగ్, అనూప్ తదితరులు  ప్రశ్నించారు.  సమావేశంలో  డిప్యూటీ మేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చల్ల స్వరూపరాణి హరిశంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కమిషనర్ బోనగిరి  శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ స్వరూపరాణి, కార్పొరేటర్లు  అధికారులు  పాల్గొన్నారు.