వాళ్లకి మీమ్​ కాంటెస్ట్​లో పార్టిసిపేట్ చేయాలని ఆశ

వాళ్లకి మీమ్​ కాంటెస్ట్​లో పార్టిసిపేట్ చేయాలని ఆశ

టైటిల్ : మీమ్​ బాయ్స్ (వెబ్ సిరీస్​), డైరెక్షన్​ : అరుణ్ కౌశిక్, కాస్టింగ్ : గురు సోమసుందరం, బడవ గోపి, సిద్ధార్థ్​ బాబు, ఆదిత్య భాస్కర్, జయంత్, నమ్రత, నిఖిల్ నాయర్, లాంగ్వేజ్ : తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ, ప్లాట్ ఫాం : సోనీ లివ్, రన్​ టైం : ఎనిమిది ఎపిసోడ్స్ (ఒక్కోటి అరగంట)

ఒక ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకునే ముగ్గురు అబ్బాయిలు, ఒక అమ్మాయి అరెస్ట్​ అవ్వడంతో కథ మొదలవుతుంది. వాళ్లని ఎందుకు అరెస్ట్​ చేశారు అనే దానిచుట్టూ కథ నడుస్తుంది. అసలు ఆ నలుగురు ఎవరంటే... వాళ్లకి మీమ్​ కాంటెస్ట్​లో పార్టిసిపేట్ చేయాలని ఆశ. అందుకోసం ఒక మీమ్​ పేజ్ క్రియేట్ చేసి, కొన్ని మీమ్స్​ అప్​లోడ్ చేస్తారు. వాటికి వ్యూయర్స్​ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంటుంది. కానీ, వాళ్ల కాలేజీలో జరిగే కొన్ని విషయాలను వ్యతిరేకిస్తూ డీన్​పై మీమ్స్ చేయడంతో ఆయనకు కోపం వస్తుంది. ఆ మీమ్స్ చేసింది ఎవరనేది ఆయన కనిపెట్టాడా? ఆ తర్వాత ఏం జరిగింది? అనేది చూడాల్సిందే. ఈ సిరీస్​ మొదటి రెండు ఎపిసోడ్లు బాగానే అలరిస్తాయి. మిగతా ఎపిసోడ్లలో ఒకటి రెండు అంతగా ఆకట్టుకోలేదు. చివరి ఎపిసోడ్​లో క్లైమాక్స్ ఫర్వాలేదనిపిస్తుంది. రెండో సీజన్​ కంటిన్యూ అవుతుందని ఒక క్లూ ఇచ్చారు. ఓవరాల్​గా ఈ సిరీస్​లో ఒకటే విషయం రిపీట్ అవ్వడం వల్ల కాస్త బోర్​ కొట్టినా, మెయిన్​ లీడ్స్​గా చేసిన నలుగురి యాక్టింగ్​తో​​ బాగానే ఎంటర్​టైన్ చేశారు.