కాకా వెంకటస్వామి వర్ధంతి

కాకా వెంకటస్వామి వర్ధంతి

సంగారెడ్డి టౌన్ ,వెలుగు;కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు  జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో స్థానిక  అంబేద్కర్ స్టేడియంలో, కలెక్టరేట్ కార్యాలయంలోనూ  ఆదివారం  అధికారికంగా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.  వెంకటస్వామి చిత్రపటానికి కలెక్టరెట్​ సూపరింటెండెంట్ భాను ప్రకాశ్​ పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా  సూపరింటెండెంట్​  భాను ప్రకాశ్​   మాట్లాడుతూ, సుదీర్ఘ కాలం పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన వెంకటస్వామి దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని కొనియాడారు. ఆయన సేవలను గుర్తిస్తూ నిరంతరం స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహిస్తోందని అన్నారు. వర్ధంతి కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

కోహెడ : మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి(కాకా)కార్మిక రంగానికి, బడుగు వర్గాలకు చేసిన సేవలు మరువ లేనివని కాంగ్రెస్​ మండల  అధ్యక్షుడు మంద ధర్మయ్య కొనియాడారు.ఆదివారం కోహెడ మండల కేంద్రంలో కాకా వర్దంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్బంగా కాకా ఫోటోకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. అయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శంకర్​, బాలకిషన్​, జయరాజ్​,వెంకటస్వామి, సుధాకర్​, కనుకయ్య, శ్రీనాధ్​ మహర్షి, రాకేశ్​ తదితరులు ఉన్నారు.