జ్ణాపక శక్తి మనిషి మెదడులో మాత్రమే నిల్వ ఉండదని న్యూయార్క్ యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది. కిడ్నీ, నరాల కణజాలం నుంచి కణాలు మెదడు కణాల మాదిరిగానే జ్ణాపకాలను ఏర్పరుస్తాయని అధ్యయనం చెబుతోంది.మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్ల పేలుళ్లను అనుకరించే రసాయన పప్పులు ఎప్పలుడు పునరావృ తమవుతాయో నాన్ మెదడు కణాలు గుర్తించగలవని పరిశోధన వెల్లడించింది.
నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్ లో ప్రచురించబడిన ఈ అధ్యయనం జ్ణాపకశక్తి సంబంధిత రుగ్మతలకు చికిత్స చేయడానికి కొత్త మార్గాలను సుగమం చేస్తుందని చెబుతోంది. శరీరంలో ఇతర కణాలు కూడా నేర్చుకోగలవు, జ్ణాపకాలను దాచుకోగలవని’’ యూఎస్ లోని న్యూయార్క్ యూనివర్సిటీ రీసెర్చర్, రచయిత కుకుష్కిన్ చెబుతున్నారు.
Also Read : ఈ 4 విటమిన్ లోపాలు క్యాన్సర్‌కు దారితీస్తాయట..
మెదడు కణాల మాదిరిగానే నాన్ మెదడు కణాలు కూడా కొత్త సమాచారానికి ప్రతిస్పందనగా మెమరీ జన్వువుని సక్రియం చేయగలవని పరిశోధకులు కనుగొన్నారు.
జ్ణాపకశక్తిని అధ్యయనం చేయడానికి కొత్త మార్గాలను అందించడంతోపాటు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి మన శరీరం మెదడు వంటిది అని పరిశోధన సూచిస్తుంది.