- నల్గొండ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ ఛాంబర్ ఎదుట డాక్టర్ల నిరసన
నల్లగొండ జిల్లా: ఆదివారాలు, పండుగలకు విధులకు హాజరుకాలేదని నల్గొండ మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న 57 మంది డాక్టర్లకు నల్గొండ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మెమోలు జారీ చేశారు. ప్రతినెల 21 తారీకు వరకు అటెండెన్స్ బయోమెట్రిక్ షీట్ ను సూపరిండెంట్ ఛాంబర్ కు పంపించాలి కానీ 25 తేదీ వచ్చినా కూడా ప్రిన్సిపాల్ పంపలేదు. సదరు మెమోలని ప్రిన్సిపాల్ నిన్ననే సూపరిండెంట్ కి పంపించగా వాటిని సూపరింటెండెంట్ వెనక్కి పంపించారు.
మళ్లీ ఈరోజు అవే మెమోలను ప్రిన్సిపాల్ సుపరిండెంట్ కి పంపించగా.. ప్రిన్సిపాల్ ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఒకేసారి 57 మంది డాక్టర్ల కు మెమోలు ఇస్తున్న విషయాన్ని కలెక్టర్ కు ఫోన్లో సుపరిండెంట్ వివరించిన విషయం బయటకు పొక్కింది. తమకు మెమోలు జారీ చేయడంపై డాక్టర్లు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కక్ష పూరితంగానే ప్రిన్సిపల్ తమకు మెమోలు జారీ చేశారంటూ ప్రిన్సిపల్ వైఖరిని నిరసిస్తూ ఆస్పత్రిలోని సూపరింటెండెంట్ ఛాంబర్ ఎదుట డాక్టర్లు ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపాల్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. డాక్టర్ల ఆందోళనతో ఆస్పత్రిలో కొంతసేపు ఉద్రిక్తత ఏర్పడింది.
ఇవి కూడా చదవండి
అవినీతి ఆరోపణలపై పంజాబ్ మంత్రి అరెస్ట్