ర్యాపిడో డ్రైవర్ కి అమ్మాయి పరిచయం.. చర్చిలో పెళ్లి.. హైదరాబాద్ లో అరెస్ట్.. ఏం జరిగిందంటే..?

మాయమాటలతో ఒకరికి తెలియకుండా మరొకరిని మూడు పెండ్లిళ్లు చేసుకున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. జవహర్ నగర్ సీఐ సైదయ్య వివరాల ప్రకారం.. జవహర్ నగర్​లోని అంబేద్కర్ నగర్ గబ్బిలాల్​పేటకు చెందిన లక్ష్మణరావు(34) ర్యాపిడో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. లక్ష్మణరావు తన బంధువుల అమ్మాయి అయిన అనూషను 2014లో పెండ్లి చేసుకున్నాడు. మనస్పర్థలు కారణంగా ఆమెతో దూరంగా ఉంటున్నాడు.

ర్యాపిడో డ్రైవర్​గా పనిచేస్తున్న క్రమంలో అతనికి బాలాజీనగర్​కు చెందిన లీలావతి పరిచయమైంది. ప్రేమిస్తున్నానని చెప్పి మెదక్ చర్చిలో ఆమెను 2021లో పెండ్లి చేసుకున్నాడు. బాబు పుట్టిన తర్వాత తప్పించుకుని తిరుగుతున్నాడు. లక్ష్మణ్​ మల్కాజిగిరిలో ఉంటున్నాడని లీలావతి కుటుంబసభ్యులు తెలుసుకొని నిలదీశారు. మరో మహిళ శబరిని పెండ్లి చేసుకున్నట్లు అతడు చెప్పడంతో లీలావతి  పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని జవహర్ నగర్​ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.