లోన్ యాప్ వేధింపులతో యువకుడు సూసైడ్

శామీర్ పేట: లోన్ యాప్ వేధింపులతో మరో యువకుడు బలయ్యాడు. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన ప్రశాంత్ (26) రెండు నెలల నుంచి మేడ్చల్ జిల్లా తూంకుంటలోని హెచ్ పీ పెట్రోల్ బంక్​లో పనిచేస్తున్నాడు. డబ్బులు అవసరం ఉండి లోన్ యాప్​లో లోన్ తీసుకున్నాడు. కొన్నిరోజులుగా లోన్​యాప్​ నిర్వాహకులు డబ్బులు చెల్లించాలని వేధించడంతో తీసుకున్న దానికంటే అధికంగా నగదు చెల్లించాడు. అయినప్పటికీ ఇంకా చెల్లించాలని వేధించడంతో చెట్టుకు ఉరేసుకొని మృతి చెందాడు. ఈ ఘటనపై శామీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.