బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, హీరోయిన్ దీపికా పదుకునే జంటగా నటించిన పఠాన్ కు భారీ స్పందన వస్తోంది. ఇప్పటికే రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఏ పాటయితే వివాదానికి కారణమైందో అదే బేషరమ్ పాట ఇప్పుడు ట్రెండింగ్ లో నిలుస్తోంది. ఓ థియేటర్లో సినిమాలో ఆ పాట ప్లే అవుతుండగానే ఇద్దరు యువకులు వచ్చి స్ర్రీన్ కు ఎదురుగా నిలబడి డ్యాన్స్ చేయడం అందర్నీ ఆకర్షించింది. దానికి తోడు అక్కడున్న సినీ లవర్స్ కూడా వారిని ఎంకరేజ్ చేస్తూ.. చప్పట్లు కొట్టారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను శైలేష్ వైలేజ్ అనే పేరున్న ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియోలో ఇద్దరు యువకులు స్క్రీన్ కు ఎదురుగా అచ్చం సినిమాలో హీరో, హీరోయిన్లు వేసిన స్టెప్పులనే వేస్తూ.. అందర్నీ ఆకట్టుకున్నారు.