
జీడిమెట్ల: క్రికెట్ బాల్ విషయంలో తలెత్తిన వివాదం కత్తిపోట్లకు దారితీసింది. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. సూరారం రాంలీలా మైదానంలో ఈ నెల11న స్థానికంగా ఉండే లోకేశ్(18), లలిత్ (20) క్రికెట్ఆడుతున్నాడు. ఈ క్రమంలో గ్రౌండ్ పక్కన ఉన్న బీహార్‌కి చెందిన పేయింటర్స్సంతోష్ (32), రాజ్‌కుమార్( 28) ఇంట్లో బాల్ పడింది. దీంతో ఇరువర్గాల మధ్య గొడవ జరగగా, లలిత్ తన ఫ్రెండ్ అమూల్ (22)కు ఫోన్ చేసి సంఘటనా స్థలానికి పిలిపించాడు.
ముగ్గురు కలిసి పేయింటర్స్పై కత్తితో దాడికి పాల్పడ్డారు. దీంతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్న బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో కొందరు నాయకులు తలదూర్చి కేసు నమోదు కాకుండా ప్రయత్నించినట్లు సమాచారం.