న్యూఢిల్లీ: ప్లాటినం గిల్డ్ ఇంటర్నేషనల్ (పీజీఐ) ఇండియా మహేంద్ర సింగ్ ధోనితో కలిసి ప్రత్యేకమైన సిగ్నేచర్ కలెక్షన్‌ను ప్రారంభించింది. ఈ కలెక్షన్లోని ప్రతి ఉత్పత్తి ధోనీ స్టైల్‌ను ప్రదర్శిస్తుందని తెలిపింది. ఇందులోని ఉత్పత్తులు అత్యుత్తమ నాణ్యత కలిగిన పదార్థాలతో తయారయ్యాయని ప్రకటించింది. ఈ కలెక్షన్లో గ్రిడ్ బ్రాస్లెట్, చైన్ల వంటి నగలు, గడియారాలు, సూట్లు వంటి విభిన్న రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి.
ఇందులోని నగలను 95శాతం ప్లాటినంతో తయారు చేశామని పీజీఐ ప్రకటించింది. ఈ కలెక్షన్ మంగళవారం నుంచి స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.