ఏం తెలివులురా : పెద్ద కారులో వచ్చి.. కోడి గుడ్ల లారీ ఎత్తుకెళ్లిన దొంగలు

కోడిగుడ్ల లోడ్ తో వెళ్తున్న  లారీని కొంతమంది దుండగులు అపహరించారు. లక్నో... ఎస్ యూవీలో లారీని అడ్డగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు  అప్రమత్తమయ్యారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి లారీని స్వాధీనం చేసుకుని, నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

ఎస్‌యూవీలో వ‌చ్చి కోడిగుడ్లను తీసుకువెళుతున్న ట్రక్‌ను అటకాయించిన దుండగులు ఎగ్స్‌ను చోరీ చేసిన ఘ‌ట‌న ల‌క్నోలో క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఎగ్ వ్యాపారి స‌హా ఐదుగురిని అరెస్ట్ చేశారు. జూన్ 19న హ‌రియాణ నుంచి ఎగ్స్‌ను ట్రక్‌లో డ్రైవ‌ర్ మోతీలాలా ఆయ‌న భాగ‌స్వామి మున్నాలాల్ ల‌క్నోకు త‌ర‌లిస్తుండ‌గా న‌గరంలోని ఇటౌంజ ప్రాంతం వ‌ద్ద ఎస్‌యూవీలో వ‌చ్చిన దుండ‌గులు అట‌కాయించారు. కారులో వచ్చిన దుండగులు  కోడిగుడ్ల లారీని ఎత్తుకెళ్లారు. 

ALSOREAD:బూంరాంగ్ అంటే ఇదే : పెళ్లాం మెడలో దండేయరా అంటే.. కాళ్లపై పడ్డాడు 

ట్రక్ డ్రైవ‌ర్‌తో పాటు అత‌డి పార్టన‌ర్‌తో ఘ‌ర్షణకు దిగిన దుండ‌గులు ఇద్దరినీ తీవ్రంగా కొట్టారు. ఆపై వారు ఎగ్స్‌తో నిండిన ట్రక్‌తో స‌హా ఘ‌ట‌నా స్ధలం నుంచి పారిపోయారు. చోరీకి గురైన కోడిగుడ్ల విలువ రూ. 5 లక్షలు ఉంటుంద‌ని స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌పై ద‌ర్యాప్తు జ‌రిపిన పోలీసులు ఐదుగురు నిందితుల‌ను అరెస్ట్ చేశారు.నిందితుల‌ను ఎగ్ వ్యాపారి మ‌హ్మద్ ఫ‌ర‌జ్‌, టెంపో డ్రైవ‌ర్ ముంతాజ్‌, మొబైల్ ఫోన్ మెకానిక్ అజ్మత్‌, కూర‌గాయ‌ల వ్యాపారులు సుఫియ‌న్‌, ఇస్తియ‌క్‌లుగా గుర్తించారు. నిందితుల నుంచి చోరీకి గురైన ఎగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని డీసీపీ నార్త్‌జోన్ ఖాసిం అబ్ధి తెలిపారు.