మగవారు మహిళలను అసభ్యకరంగా టచ్ చేస్తున్నారని.. టైలర్, సెలూన్ షాపుల్లో బ్యాడ్ టచ్ చేస్తున్నారని ఉమెన్ కమిషన్ ఛైర్మన్ బబితా చౌహన్ అన్నారు. అందుకే పురుషులు ఎవ్వరూ కూడా లేడీస్ బట్టలు కూట్టకూడదని, లేడీస్ మాత్రమే వారి దుస్తువులు కుట్టడానికి కొలతలు తీసుకోవాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ప్రతిపాదించింది. మహిళను బ్యాడ్ టచ్ నుంచి రక్షించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ బబితా చౌహాన్ అన్నారు. సెలూన్ షాప్, టైలరింగ్ షాపుల్లో ఉద్దేశపూర్తకంగా కొందరు మహిళలను అసభ్యంగా తాకుతున్నారని ఆమె మండిపడ్డారు. ఇలాంటి బ్యాడ్ టన్ ను అరికట్టడానికి కేవలం మహిళలు మాత్రమే లేడీస్ టైలరింగ్ చేయాలని, మహిళలకు హేయిర్ కట్ చేసేలా చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ చైర్మన్ బబితా చౌహన్ అన్నారు.
ALSO READ : బాస్ లీవ్ ఇవ్వలేదని.. వీడియో కాల్‌లో పెళ్లి : ఎక్కడో తెలిస్తే షాక్
అక్టోబర్ 28న జరిగిన సమావేశంలో ఆమె ఈ నిర్ణయాలను తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాని సూచించారు. అలాగే ఆయా సెంటర్లలో సీసీటీవీలు ఏర్పాటు చేయాలని కూడా ఉమెన్ కమిషన్ మెంబర్ హిమానీ అగర్వాల్ తెలిపారు. ఉమెన్ కమిషన్ చైర్మన్ బబితా చౌహాన్ శుక్రవారం ఈ విషయాలను ఓ నేషనల్ మీడియా సంస్థకు తెలిపారు. ఈ ప్రతిపాదనకు మీటింగ్ కు వచ్చిన మహిళా కమిషన్ సభ్యులు అంగీకారం తెలిపారని ఆమె చెప్పారు. ఉత్తర ప్రదేశ్ లో తర్వలోనే లేడీస్ మాత్రమే మహిళలకు హేయిర్ కట్, టైలరింగ్ చేయాలనే నిబంధనలు అమలు అయ్యే అవకాశం ఉంది.