గుబురు గడ్డం పెంచడం ఇప్పుడో ట్రెండ్ గా మారింది. సినిమాల్లో హీరోలు కూడా ఇలా గుబురు. గడ్డంతోనే కనిపిస్తున్నారు. దీంతో చాలా మంది యువకులు దీన్నే ఫాలో అవుతున్నారు. ఇలా ఎక్కువగా గడ్డం పెంచే వాళ్లకు ఓ హెచ్చరిక! గడ్డం ఎక్కువగా పెంచే మగవాళ్లలో అధిక బ్యాక్టీరియా ఉంటుందట. అది కూడా పెంపుడు కుక్కల చర్మం(ఉన్ని)పై ఉండే బ్యాక్టీరియాకంటే మగవాళ్ల గడ్డంలోనే ఎక్కువ బ్యాక్టీరియా ఉందని ఇటీవలి ఓ పరిశోధనలో తేలింది.
స్విట్జర్లాండ్ లోని హిరాండెన్ క్లీనిక్ కు చెందిన పరిశోధకులు కొంత మంది గడ్డం పెంచిన వ్యక్తులను, కొన్ని పెంపుడు కుక్కలను స్కాన్ చేసి చూశారు. దీనిలో కుక్క బొచ్చులో కంటే మగవాళ్ల గడ్డంలోనే ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నట్లు వాళ్లు గుర్తించారు. దీని ప్రకారం గడ్డం పెంచిన వాళ్లకన్నా కుక్కలే శుభ్రంగా ఉంటున్నాయని పరిశోధకుల్లో ఒకడైన ఆండ్రియాస్ గట్ జిట్ తెలిపారు. ఇలా ఎక్కువ గడ్డం పెంచడం వల్ల బ్యాక్టీరియా పెరిగి మగవాళ్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని ఆయన అన్నారు. సో.. మగవాళ్లు ఎప్పుడూ షేవ్ చేసుకుంటే బెటర్ అని సైంటిస్టుల సలహా!