
భావోద్వేగాల విషయంలో ఆడవారితో పోలిస్తే మగవాళ్లు కాస్త స్ట్రాంగ్ గా ఉంటారు. కానీ వాళ్లకూ మనసుంటుంది. వాళ్లకూ ఏడవాలని, వాళ్లనూ ఓదార్చేవాళ్లు ఉండాలని అనిపిస్తుంది. కాకపోతే ఆడవాళ్లలా అందరి ముందూ కాకుండా చాలా మంది తమ బాధను లోపలే ఉంచుకుని, లోలోపలే కుమిలిపోతూ ఉంటారు. అది కుటుంబం విషయంలోనైనా కావచ్చు, ప్రేమ, బాధ్యతలు, ఇతర బంధాల విషయంలోనూ కావచ్చు. ముఖ్యంగా ప్రేమ విషయానికొస్తే.. హార్ట్ బ్రేక్, బ్రేకప్ వంటివి ఎవరినైనా తీవ్రంగా బాధిస్తాయి. అంతటితో జీవితం అయిపోయిందనేటట్టు చేసేస్తాయి. స్త్రీల కంటే పురుషులు విడిపోవడాన్ని ఎదుర్కోవడానికి చాలా కష్టపడతారన్నది నిరూపితమైన వాస్తవం. అందుకే వారు ముందుకు సాగడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ముఖ్యంగా ఇది వారి మొదటి హార్ట్‌బ్రేక్ అయితే.. అంతటితో ప్రపంచం అంతం అయినట్లు ఫీలవుతూ ఉంటారు. హార్ట్‌బ్రేక్ జరిగినా, అమ్మాయి మోసం చేసి వెళ్లిపోయినా, ఇతర కారణాల వల్ల ఒకరికి దూరమైనా.. అంతటితోనే జీవితం ఆగిపోలేదు.. ఇంకా చాలా ఉంది చేయాల్సింది, చూడాల్సింది అని అనిపించేలా చేయాలంటే మగాళ్లు కొన్ని టిప్స్ ఫాలో కావాలి. ఇటీవలి కాలంలో హార్ట్ బ్రేక్ అయ్యి.. మళ్లీ మూవ్ ఆన్ అయిన కొందరు పురుషులు చెప్పే తెలివైన సలహాలు, చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అవుట్ ఆఫ్ సైట్, అవుట్ ఆఫ్ మైండ్
"సోషల్ మీడియాలో మీ మాజీని అన్‌ఫాలో చేయడం వలన ఈ బాధను కాస్త తగ్గించుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ లాంటి సైట్స్ లో సంతోషంగా ఉన్న ప్రేమికుల లేదా వ్యక్తుల ఫొటోలు, వీడియోను మీ బాధను గుర్తుకు తెస్తే, సోషల్ మీడియాను వాడకపోవడమే మంచిది".
2. జరిగిన దాని నుండి నేర్చుకోండి & మిమ్మల్ని మీరు క్షమించుకోండి
"అవతలి వ్యక్తి చేసిన తప్పులు ఏంటో గుర్తించండి. తద్వారా మీరు మళ్లీ అలాంటి వ్యక్తితో ముందుకు సాగేందుకు ప్రయత్నించరు. రియాలిటీని గుర్తించి, మీ తప్పులు ఏంటో కూడా గుర్తించండి. మిమ్మల్ని మీరు క్షమించుకోవడానికి ఉత్తమ మార్గం ఒక వ్యక్తిగా మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడమే”.
3. తాగడం లేదా అర్థరహితమైన గొడవలు పరిష్కారం కాదు
“హార్ట్ బ్రేక్ అనేది అంత త్వరగా పోదు. ఇది కనిపించని బాధ, గాయం లాంటిది. సో రోజులు గడుస్తున్నా ఆ నొప్పి ఇంకా అలాగే ఉంటుంది. ఈ గాయం నయం కావడానికి కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. అలా అని ఆ బాధను మర్చిపోవడానికి తాగడమో, వదిలి వెళ్లిపోయిన వారితో గొడవ పడడమో పరిష్కారం కాదని తెలుసుకోండి. అవన్నీ ఆ సమయంలో మీకు స్వాంతన కల్గించేలా అనిపించినప్పటికీ.. అవి అసలైన పరిష్కారాలు కావని తెలుసుకోండి".
4. మాట్లాడండి
“బ్రేక్-అప్ సమయంలో లేదా ఆ తర్వాత గానీ మీ స్నేహితులు లేదా మీకు దగ్గరగా, నమ్మకంగా అనిపించే వ్యక్తులపై ఆధారపడటం చాలా అవసరం. ఎవరితోనైనా మాట్లాడటం వల్ల బాధను కాస్తను మర్చిపోయిన వారవుతారు. వాళ్లెవరూ మీ బాధను తీర్చకపోవచ్చు. కానీ ఆ సమయంలో మీ బాధను, మిమ్మల్ని పట్టించుకునే వారు ఒకరున్నారన్న ధైర్య ఉంటే చాలు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది".
5. ఏదో ఒక పని చేస్తూ ఉండండి
“కాలం గడుస్తున్నా.. మీరు అలాగే ఉంటే ఎలాంటి మార్పూ కనిపించకపోవచ్చు. అందుకు పనే సరైన మార్గం. పనిలోనే మీ సంతోషాన్ని వెతుక్కోండి. కొన్నిసార్లు అది ఇచ్చే ఆత్మ సంతృప్తి ఏ గొప్ప వ్యక్తీ ఇవ్వలేరు. మరికొన్ని సార్లు మీరు అత్యున్నత శిఖరాలను అందుకుని, మిమ్మల్ని వదిలి వెళ్లిన వాళ్లు తిరిగి వచ్చేలానూ చేయొచ్చు".