పూర్తిగా గడ్డం ఉన్న పురుషులు ఎంతమంది ఉన్నారంటే..

పూర్తిగా గడ్డం ఉన్న పురుషులు ఎంతమంది ఉన్నారంటే..

గడ్డం అనేది మగాళ్లకు అందమని చాలా మంది పురుషుల అభిప్రాయం. రీసెంట్ డేస్ లో అయితే గడ్డం స్టైల్స్ లోనూ అనేక రకాలు వచ్చాయి. కొంతమంది పురుషులు గడ్డం తీయడానికే ఇష్టపడరు. ముఖంపై వెంట్రుకలు కలిగి ఉండటం అనేది సంవత్సరాల తరబడి జరిగే ఆన్-ఎగైన్, ఆఫ్-ఎగైన్ ట్రెండ్‌లలో ఒకటి. అయితే కొంతమంది పురుషులు కొన్ని సీజన్లలో గడ్డం ఉంచుతారు, కొందరు ఏడాది పొడవునా, మరికొందరు బయట వేడిగా ఉన్నప్పుడు షేవ్ చేస్తారు. అయితే ఎంత మంది పురుషులకు గడ్డం ఉంచుకోవడం ఇష్టం, ఎంతమందికి ఉంచుకుంటున్నారన్న దానిపై రీసెంట్ గా చేసిన ఓ సర్వే.. ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది. ఇంతకీ ఈ గడ్డం గణాంకాలు ఏమి చెబుతున్నాయంటే..

ALSO READ :ప్రతిరోజూ షేప్‌వేర్ లు ధరిస్తున్నారా.. ఐతే హెల్త్ ప్రాబ్లెమ్స్ కంపల్సరీ

  • అమెరికాలో 75% మంది పురుషులు గడ్డంతో ఉన్నపుడు మరింత ఆత్మవిశ్వాసంతో ఉన్నారని అంచనా.
  • 33% అమెరికన్ పురుషులు తాము ఎప్పుడూ గడ్డం ఉంచుతామని చెప్పారు.
  • పూర్తి గడ్డం పెరగడానికి రెండు, ఆరు నెలల మధ్య సమయం పడుతుంది.
  • 73% మంది పురుషులు.. ముఖంపై వెంట్రుకలు ఉన్నప్పుడు.. లేనప్పుడు కన్నా ఆకర్షణీయంగా ఉన్నట్టు భావిస్తున్నారట.
  • సర్వేలో పాల్గొన్న 23.6% మంది పురుషులు గడ్డం పెంచుకోలేక పోవడం వల్ల తమలో పురుషత్వం తగ్గుతుందని చెప్పారు.
  • 2026 నాటికి, ప్రపంచ గడ్డం గ్రూమింగ్ మార్కెట్ 43.1 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.
  • ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 44% మంది పురుషులు పూర్తి గడ్డాలు కలిగి ఉన్నారు.
  • ఒక సంవత్సరంలో మనిషి గడ్డం సగటు పెరుగుదల 5.5 అంగుళాలు.
  • 41% మంది మహిళలు క్లీన్ షేవ్ చేసిన పురుషులను అత్యంత ఆకర్షణీయంగా గుర్తించారు.
  • 90% మంది హెచ్‌ఆర్ నిపుణులు క్లీన్ షేవ్ చేసిన ముఖం ఓ స్ట్రాంగ్ ఇంప్రెషన్ ను కలిగిస్తుందని నమ్ముతున్నారు.

ఇవే కాకుండా ఐదు సంవత్సరాల క్రితం, పురుషులలో 29% మాత్రమే పూర్తి గడ్డాలు కలిగి ఉన్నారని, 40% మంది పురుషులు షేవ్ చేయకుండా ఉన్నారని.. దీనికి విరుద్ధంగా, కొద్ది పాటి హెయిర్ తో ఉన్న పురుషుల శాతం 52% అని ఈ సర్వే వెల్లడించింది. అంతే కాకుండా ఒక వ్యక్తి తన జీవితాంతం షేవింగ్ చేయడం మానేస్తే, ఆ వ్యక్తి తన జీవితకాలంలో 30 అడుగుల పొడవు గడ్డం పెంచుకోవచ్చట. పురుషులు తమ జీవితంలో 3వేల గంటలకు పైగా షేవింగ్‌కు మాత్రమే గడుపుతారని కూడా తెలిపింది. కుక్కల వెంట్రుకల కంటే పురుషుల గడ్డాలలో ఎక్కువ క్రిములు ఉంటాయని కూడా స్పష్టం చేసింది.