మెంగారం శివాలయంలో చోరీ

మెంగారం  శివాలయంలో చోరీ

లింగంపేట, వెలుగు :  మండలంలోని మెంగారం గ్రామ శివాల యంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇనుప రాడ్డు  సాయంతో ఆలయం తాళాలు పగులగొట్టి లోనికి  ప్రవేశించారు.  హుండీని పగుల గొట్టి నగదు,అమ్మవారి మెడలోని బంగారు పుస్తెను చోరీ చేసినట్లు ఆలయ ధర్మకర్త  శ్రీశైలం తెలిపారు. శివాలయంలో చోరీ జరగడం ఇది నాలుగోసారి . కామారెడ్డి -ఎల్లారెడ్డి ప్రధాన రహదారి  పక్కన గల శివాలయంలో వరుస చోరీలు జరుగుతుండడంతో పోలీసులు గస్తీ నిర్వహించాలని  మెంగారం గ్రామస్తులు కోరుతున్నారు.