అర్జున్‌కు మెనోర్కా చెస్ టైటిల్

అర్జున్‌కు మెనోర్కా చెస్ టైటిల్

హైదరాబాద్, వెలుగు : ఇండియా గ్రాండ్ మాస్టర్, తెలంగాణ కుర్రాడు ఎరిగైసి అర్జున్  మెనోర్కా ఓపెన్ చెస్ టోర్నీలో చాంపియన్‌గా నిలిచాడు. స్పెయిన్‌లోని మెనోర్కాలో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో  9 రౌండ్లకు గాను 7.5 పాయింట్లు సాధించి టైటిల్ నెగ్గాడు. 

ఈ క్రమంలో  ఫిడే లైవ్ రేటింగ్‌‌‌‌‌‌‌‌లో నాలుగు స్థానాలు మెరుగై  2762 పాయింట్లతో ఐదో ప్లేస్‌‌‌‌‌‌‌‌కు చేరుకున్నాడు. లైవ్ రేటింగ్‌‌‌‌‌‌‌‌లో అర్జున్ తర్వాత ఇండియా నుంచి విశ్వనాథన్ ఆనంద్ 11వ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నాడు. అర్జున్ ఈ మధ్యే  ఆనంద్‌ను వెనక్కు నెట్టి ఇండియా నంబర్ వన్‌గా నిలిచాడు.