
పారిస్ : ఒలింపిక్స్‌లో ఇండియన్ ఆర్చర్ల గురి అదిరింది. టీమ్ ఈవెంట్స్‌లో మెన్స్, విమెన్స్ జట్లు క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించాయి. గురువారం జరిగిన విమెన్స్ ర్యాంకింగ్ రౌండ్‌లో అంకితా భాకట్ (666), భజన్ కౌర్ (559), దీపిక కుమారి (658)తో కూడిన ఇండియా త్రయం 1983 పాయింట్లతో నాలుగో ప్లేస్‌లో నిలిచి క్వార్టర్స్‌కు చేరింది. సౌత్ కొరియా, చైనా, మెక్సికో టాప్–3లో నిలిచాయి.
ఇండివిడ్యువల్ కేటగిరీలో అంకిత 11వ, భజన్ 22వ, దీపిక 23వ ప్లేస్‌ల్లో నిలిచారు. మెన్స్ ర్యాంకింగ్ రౌండ్‌లో బొమ్మదేవర ధీరజ్ (681), తరుణ్‌దీప్ రాయ్ (674), ప్రవీణ్ జాదవ్ (658)తో కూడిన టీమ్ మొత్తం 2013 పాయింట్లతో మూడో ప్లేస్‌ను సాధించింది. వ్యక్తిగత రౌండ్‌లో ధీరజ్ నాలుగో స్థానంలో నిలవగా, తరుణ్ 14, ప్రవీణ్ 39వ ర్యాంక్‌లో నిలిచారు.