
న్యూఢిల్లీ: మరో మెగా హాకీ టోర్నమెంట్‌కు బీహార్‌లోని రాజ్‌గిర్ సిటీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరిగే మెన్స్ ఆసియా కప్ హాకీ టోర్నమెంట్ ఆతిథ్య హక్కులు రాజ్‌గిర్ సిటీకి లభించాయి.
ఈ మెగా ఈవెంట్ 2026 ఎఫ్‌ఐహెచ్ హాకీ వరల్డ్ కప్‌కు క్వాలిఫయింగ్ టోర్నీగా ఉండనుంది. టోర్నీ విన్నర్ వరల్డ్ కప్‌నకు నేరుగా అర్హత సాధిస్తుంది. ఇందులో 8 జట్లు పోటీ పడనున్నాయి. ఇండియా, పాకిస్తాన్, జపాన్, కొరియా, చైనా, మలేసియా అర్హత సాధించగా.. ఏహెచ్‌ఎఫ్ కప్ ద్వారా మరో రెండు జట్లు అర్హత సాధిస్తాయి.