
చిలప్ చెడ్, వెలుగు: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఉంటుందని రంగంపేట పీఠాధిపతి మాధవనంద సరస్వతి స్వామి అన్నారు. సోమవారం మండలంలోని గౌతపూర్ ఆంజనేయస్వామి ధ్వజస్తంభం, నవ గ్రహవిగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆయన హాజరై భక్తులకు ప్రవచనాలు ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వరూప విఠల్, అంజిరెడ్డి, గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శంకరయ్య, సత్యనారాయణ పాల్గొన్నారు.