ఎనిమిది సీజన్‌ల పాటు ఐపీఎల్ టోర్నమెంట్‌కు దూరంగా ఉన్న మిచెల్ స్టార్క్..2024 సీజన్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. గత డిసెంబరులో దుబాయ్‌లో జరిగిన వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ ఆసీస్ పేసర్ ను రూ. 24.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పలికిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఒక బౌలర్ కోసం ఇంత మొత్తం వెచ్చించడంతో స్టార్క్ తన ధరకు న్యాయం చేయగలుగుతాడా అనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది.
కేకేఆర్ మెంటార్ గా ఉంటున్న గంభీర్ మాత్రం స్టార్క్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఆసీస్ బౌలర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. "స్టార్క్ కోసం ఎంత డబ్బు ఖర్చు చేసినా అతనిపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. అతను మా జట్టుకు కీ ప్లేయర్ గా మారతాడు. అతడు అంతర్జాతీయ క్రికెట్ లో అతడు ఎలాంటి ప్రదర్శన చేసాడో కేకేఆర్ తరపున అదే రిపీట్ చేస్తాడు". అని గంభీర్ విశ్వాసం వ్యక్తం చేశాడు.
స్టార్క్ ఐపీఎల్ లో ఇప్పటివరకు 27 మ్యాచ్ ల్లో 34 వికెట్లు పడగొట్టాడు. స్టార్క్ 2018 లో నైట్ రైడర్స్ వేలంలో చివరిసారిగా తీసుకుంది. అయితే గాయం కారణంగా టోర్నీ నుంచి దూరమయ్యాడు. ఈ సారి ఈ పేస్ బౌలర్ పై కేకేఆర్ భారీ ఆశలే పెట్టుకుంది. పదునైన యార్కరాలు వేయడంలో దిట్ట. కోల్‌కతా తమ తొలి మ్యాచ్ మార్చి 23న సన్ రైజర్స్ తో తలపడుతుంది. ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది.
Kolkata Knight Riders' mentor Gautam Gambhir feels that pacer Mitchell Starc will be the X-factor for the team in IPL 2024.#IPL2024 #KolkataKnightRiders #GautamGambhir #MitchellStarc #CricketTwitter pic.twitter.com/uQzzv09SSd
— InsideSport (@InsideSportIND) March 15, 2024