ఆర్మూర్ మండలంలో స్కూల్స్ ను తనిఖీ చేసిన ఎంఈవో

 ఆర్మూర్ మండలంలో స్కూల్స్ ను తనిఖీ చేసిన ఎంఈవో

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ మండలంలోని గవర్నమెంట్ స్కూల్స్ ను మంగళవారం ఎంఈవో పింజ రాజ గంగారాం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని ఫతేపూర్ స్కూల్ ను తనిఖీ చేసి ఉపాధ్యాయుల బోధన పనితీరు, వివిధ సబ్జెక్టులలో విద్యార్థుల నైపుణ్యాలు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను పరిశీలించారు.