గణితంతో ఆలోచన శక్తికి పదును

గణితంతో ఆలోచన శక్తికి పదును

బోధన్, వెలుగు: గణితంతో విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందుతుందని ఎంఈవో నాగయ్య అన్నారు. ఆదివారం బోధన్ పట్టణంలోని విజయసాయి హైస్కూల్​ గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఎంఈవో నాగయ్య మాట్లాడుతూ గణితంతో ఆలోచనశక్తిని పెంచుకోవచ్చన్నారు. అనంతరం గణిత క్విజ్​ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో స్యూల్ ప్రిన్సిపాల్​ కృష్ణమోహన్​, మేనేజర్​ ఐఆర్​ చక్రవర్తి, స్కూల్​ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.