పిల్లలను పంపకుంటే టీచర్​ వేరే బడికి!

పిల్లలను పంపకుంటే టీచర్​ వేరే బడికి!

‘ఒకే ఒక్కడి బడి’ని విజిట్​ చేసిన ఎంఈవో

ప్రభుత్వ బడికి పంపించాలని పేరెంట్స్​కు వినతి

గండీడ్, వెలుగు : మహబూబ్​ నగర్​​ జిల్లా మహ్మదాబాద్  మండలం రాగారిపల్లి పాఠశాలను సోమవారం ఎంఈవో  వెంకటయ్య విజిట్ చేశారు. ‘ఐదు తరగతులకు ఒకే ఒక్కడు’ శీర్షికతో  వెలుగు దినపత్రికలో వచ్చిన  కథనానికి స్పందించారు.  స్కూల్​ను సందర్శించిన అనంతరం గ్రామంలోని పేరెంట్స్​తో ఆయన  మాట్లాడారు. ప్రభుత్వ బడుల్లో క్వాలిటీ విద్య అందిస్తున్నామని పిల్లలను పంపాలని కోరారు. విద్యార్థులను పంపేలా పేరెంట్స్​తో మాట్లాడామని, విద్యార్థుల సంఖ్య పెరగకపోతే ఇక్కడి టీచర్​ను వేరే స్కూల్​కు డిప్యూటేషన్​పై పంపిస్తామని చెప్పారు. ఆయన వెంట సీఆర్పీ భరత్  ఉన్నారు.

ALSO READ:ఊర్లో ఉండలేం..వేరేచోటుకు వెళ్లలేం