
- యూపీలో ఓ మహిళ దారుణం
న్యూఢిల్లీ: అమెరికాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్న మర్చంట్ నేవీ ఆఫీసర్‌ను అతని భార్యే ప్రియుడితో కలిసి హత్య చేసింది. ఆపై అతని డెడ్ బాడీని15 ముక్కలుగా నరికి.. ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్ చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ మీరట్‌లో జరిగింది. మర్చంట్ నేవీ అధికారి అయిన సౌరభ్ రాజ్‌పుత్, ముస్కాన్ రస్తోగి 2016లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. భార్యతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో సౌరభ్ తన ఉద్యోగాన్ని వదులుకున్నాడు.
అయితే, లవ్ మ్యారేజ్ చేసుకోవడం, జాబ్ వదిలేయటం వంటి సౌరభ్ నిర్ణయాలు అతని కుటుంబానికి నచ్చలేదు. అందువల్ల ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. దాంతో సౌరభ్ తన భార్యతో కలిసి వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. మూడేండ్ల క్రితం ఇందిరానగర్‌లోని అద్దె ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాడు.
2019లోనే వారికి ఒక కుమార్తె కూడా పుట్టింది. వేరు కాపురం పెట్టాక ముస్కాన్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. ముస్కాన్ తన లవర్ సాహిల్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు సౌరభ్‌కు తెలిసింది. దాంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. తన కూతురు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సౌరభ్ విడాకుల నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకున్నాడు. 2023లో మళ్లీ మర్చంట్ నేవీలో జాబ్ లో చేరాడు.
కూతురు బర్త్ డే కోసమని వస్తే..
ఫిబ్రవరి 28న తన కూతురు బర్త్ డే ఉండటంతో సౌరభ్ ఫిబ్రవరి 24న తన ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలోనే మార్చి 4న సౌరభ్ తినే ఆహారంలో ముస్కాన్ నిద్రమాత్రలు కలిపింది. ఆపై సాహిల్, ముస్కాన్ కలిసి సౌరభ్‌ను కత్తితో పొడిచి చంపారు. డెడ్ బాడీని 15 ముక్కలుగా కోసి, డ్రమ్ములో వేసి, సిమెంటుతో సీల్ చేశారు. సౌరభ్ గురించి అడిగిన వాళ్లకు అతను హిమాచల్ ప్రదేశ్‌కు టూర్ వెళ్లాడని చెప్పి ముస్కాన్ నమ్మించింది. కానీ సౌరభ్ తమ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడంతో అతడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో భాగంగా ముస్కాన్, సాహిల్ ను విచారించగా.. సౌరభ్‌ను చంపేసినట్లు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.