జ్యోతిష్యం: ఫిబ్రవరి 27 న మీనరాశిలోకి బుధుడు... రాహువుతో కలయిక... 12 రాశుల వారి ఫలితాలు ఇవే..!

జ్యోతిష్యం: ఫిబ్రవరి 27 న మీనరాశిలోకి బుధుడు...  రాహువుతో కలయిక... 12 రాశుల వారి ఫలితాలు ఇవే..!

గ్రహాల సంచారంపై మన స్థితిగతులు ఆధారపడి ఉంటాయంటారు. జ్యోతిషశాస్త్రంలో గ్రహాల సంచారానికి పెద్ద పీట వేయడం జరిగింది. ఫిబ్రవరి 27న  రాత్రి  11:46 నిమిషాలకు మీనరాశిలోకి బుధుడు ప్రవేశించనున్నాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. బుధుడు మీనరాశిలోకి ప్రవేశించిన వెంటనే రాహువు, బుధుని కలయిక కూడా ఏర్పడనుంది. ఇలా కలయిక ఏర్పడటం వలన మొత్తంగా 12 రాశుల వారు ప్రభావితులవనున్నారు. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం.. . . 

మేష రాశి: ఫిబ్రవరి 27న బుధుడు  మీన రాశిలోకి ప్రవేశించడం వల్ల .. ఈ రాశి వారికి  ప్రతికూల ప్రభావం ఉంటుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.  మీకు ప్రమేయం లేని వాటిలో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అనుకోకుండా  సమస్యలు రావడంతో .. సమస్యలు  పెరుగుతాయి. ఉద్యోగస్తులు కొన్ని అవమానాలు పొందే అవకాశం ఉంది. ఆస్థి వివాదాల పరిష్కారాన్ని వాయిదా వేయండి.    వ్యాపారస్తుల విషయంలో కొత్త పెట్టుబడులు పెట్టకండి.. ఆర్థిక విషయాలపై తీసుకునే నిర్ణయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.

వృషభ రాశి: బుధుడు .. మీన రాశిలో సంచరించడం వలన వృషభ రాశి వారికి  ఆదాయం పెరిగే అవకాశం ఉంది.   సంపద పెరగడంతో కొత్తగా కారు .. లేదా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు పెట్టుబడి పెట్టేందుకు  అనుకూలమైన సమయం.   గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వస్తాయి.   ఇక ఉద్యోగస్తుల విషయానికొస్తే... వేతనం పెరిగే అవకాశం ఉంది.  ఆఫీసులో మీరే కీలకం కానున్నారు.  ప్రమోషన్​రావడం.. అదనపు భారం పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన జాబ్​ వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

మిథున రాశి: బుధుడు మీన రాశిలో సంచరించడం వల్ల మిథున రాశి వారికి అనుకోకుండా కొన్ని  సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారస్తులకు లాభాలు తగ్గే  సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగం ,వ్యాపారంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. సమాజంలో గౌరవం తగ్గవచ్చు. ఆరోగ్య సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విషయాల్లో విభేదాలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోండి... ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ .. ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా.. మీ పని మీరు చేసుకుంటూ పోండి.. ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు.. ఆధ్యాత్మిక చింతనతో గడపాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

కర్కాటకరాశి :  మీనరాశిలో బుధుడు.. రాహువు కలయిక వలన వీరు చేపట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది.  అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.  కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది.  కొత్తగా వ్యాపారం ప్రారంభించే వారికి ఇది అనుకూలమైన సమయం. ఉద్యోగస్తులకు .. తోటి ఉద్యోగుల సహకారం పుష్కలంగా ఉంటుంది.

సింహరాశి:బుధుడు.. మీనరాశిలో .. రాహువుతో కలయిక వలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో  సంపాదన  చాలా పరిమితంగా ఉంటుంది. మీ ఆదాయం తగ్గడమే కాకుండా.. కుటుంబ ఖర్చులకు కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి.  అయినా అనుకున్న సమయానికి అతి కష్టంపై పనులు పూర్తవుతాయి.  విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్​ వచ్చినట్టే వచ్చి కొన్ని అడ్డంకులు ఏర్పడుతాయి.  నిరుత్సాహం చెందకుండా మీ పని మీరు చేసుకుపోండి.  దైవచింతనలో గడపండి. అంతా మంచే జరుగుతుంది .

కన్యా రాశి: ఈ రాశి వారికి మీన రాశిలో బుధుడు.. రాహువు కలయిక వలన మిశ్రమ ఫలితాలుంటాయి. వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. కుటుంబసభ్యు మధ్య సమస్యలు ఏర్పడినా.. చర్చల ద్వారా పరిష్కారమవుతాయి. ఆదాయం పెరడగంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి.  ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇది మంచి సమయం. ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు వస్తాయి. ఉన్నత ఉద్యోగం కోసం ఎదురు చూసే వారు గుడ్​ న్యూస్​ వింటారు. 

తులారాశి: మీన రాశిలో బుధుడు, రాహువుల సంయోగం వల్ల  తులా రాశి వారికి అదృష్టం కలిసివస్తుంది. కోర్టు వ్యవహారాల్లో... ఈ సమయంలో విజయం పొందే అవకాశం ఉంది.  వీరు తీసుకున్న నిర్ణయాలు  ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు పరిష్కారం కావడంతో మనశ్శాంతి పొందుతారు.  వ్యాపార రంగంలో ఉన్న వారు కొన్ని కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణం చేయవచ్చు. పోటీ పరీక్షలు రాసే వారు గుడ్​ న్యూస్​ వింటారు.  ఆర్థిక విషయాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా సజావుగా సాగిపోతుంది.  వ్యాపారస్తులు కష్టపడాల్సి ఉంటుంది. 

వృశ్చికరాశి:  బుధుడు మీనరాశిలో.. వృశ్చిక రాశిలోని ఐదవ ఇంట్లో రాహువుతో ఫిబ్రవరి 27, 2025న కలయిక జరుగనుంది.  దీని ప్రభావంతో వృశ్చిక రాశి వారు షేర్​ మార్కెట్లలో లాభాలు గడిస్తారని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.  కొత్త ఆదాయ వనరులు ఏర్పడుతాయి.. మొండి బకాయిలు వసూలవుతాయి. జీవితభాగస్వామిని సంప్రదించి.. ఆలోచించి నిర్ణయం తీసుకోండి .ఉద్యోగస్తుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు.  అధికారుల ప్రశంసలతో పాటు.. అవార్డ్స్​.. రివార్డ్స్​ పొందుతారు.  వ్యాపారరంగంలో ఉన్నవారు జాక్​పాక్​ కొడతారు.  నిరుద్యోగులకు జాబ్​ రావడమే కాకుండా.. వారు ఆశించిన స్థానంలో ఉద్యోగం రావడంతో ఆనందానికి అవధులు ఉండవు.  మొత్తం మీద వృశ్చిక రాశి వారికి మీనరాశిలో బుధుడు...  రాహువుతో కలయిక వలన వీరి జీవితం అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. 

ధనస్సు రాశి: బుధుడు .. రాహువుతో కలయికవలన ధనస్సు రాశి వారు  అద్భుతమైన  ప్రయోజనాలు పొందుతారు.వృత్తి వ్యాపారంలో పురోగతి ఉంటుంది.  గతంలో పెట్టిన  పెట్టుబడులకు ఇప్పుడు  లాభాలు కలుగుతాయి. అంతే కాకుండా   ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులతో  విహార యాత్రలు చేసే అవకాశం ఉంది.  ఇక నిరుద్యోగులకు జాబ్​ వస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. 

మకర రాశి :  మీనరాశిలో బుధుడు సంచారం .. రాహువులో కలయిక కారణంగా  కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.  ఆఫీసులో ఉపయోగం లని చర్చల్లో పాల్గొనవద్దు.  ఉద్యోగస్తులు కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.  ఈ రాశి వారు .. తెలియకుండానే కొంత ఆందోళనకు గురవుతారు. పెట్టుబడుల వల్ల నష్టాలు వచ్చే అవకాశాలు  ఉన్నాయి.  ఆర్థిక పరంగా తీసుకునే నిర్ణయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఆఫీసుల్లో గొడవలు పెరిగేందుకు అవకాశాలు  ఉన్నాయని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

కుంభ రాశి:  మీనరాశిలో బుధుడు.. రాహువుతో కలయిక వలన ..నిరుద్యోగులకు మంచి ఆఫర్​ లు వస్తాయి, ప్రమోషన్​ వచ్చే అవకాశం ఉంది.  అయితే ఆవేశాన్ని తగ్గించుకోండి.  లేదంటే చాలా ఇబ్బందులు పడతారు. వ్యాపార రంగంలో ఉన్న వారుకొత్త పెట్టుబడులు పెడతారు.  ఆదాయంతో పాటు ఖర్చులు కూడా పెరుగుతాయి. సేవింగ్స్​ చేద్దామనుకున్నా ...ఈ కాలంలో పొదుపు చేయడం కష్టమవుతుంది. ప్రేమ .. పెళ్లి వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని పండితులు సూచిస్తున్నారు.

మీనరాశి: బుధుడు మీనరాశిలో రాహువుతో కలవడం ఉద్యోగస్తులు చాలా  జాగ్రత్తగా  జాబ్​ చేయాలని పండితులు అంటున్నారు.  ఎవరితోనూ ఎలాంటి వాదనలు పెట్టుకోవద్దు. కెరీర్​ మార్పు విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది. వ్యాపారస్తులకు లాభాలు లేకపోయినా నష్టాలు మాత్రం ఉండవు.  నామ మాత్రపు లాభాలను పొందుతారు. ఈ రాశి వారు ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.