బుధుడు ప్రస్తుతం మకరరాశిలో ఉన్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధుడు గ్రహాలకు యువరాజు.. తెలివితేటలు.. వ్యాపారంలో లాభ నష్టాలను బుధుడే నిర్ణయిస్తాడు. అందుకే బుధుడు తరచుగా తన స్థానాన్ని మార్చుకుంటాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 11 వ తేది మధ్యాహ్నం 12:58 గంటలకు కుంభరాశిలోకి బుధుడు ప్రవేశిస్తాడు. ఇప్పటికే కుంభరాశిలో శని సంచరిస్తున్నాడు. బుధుడు .. కుంభరాశిలో.. ఫిబ్రవరి 26 వరకు కుంభ రాశిలో ఉంటాడు. బుధ గ్రహం స్థానం మారడంతో పన్నెండు రాశులపైనా ప్రభావం ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య పండితుల అంచనాల మేరకు ద్వాదశ రాశుల్లో ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం.. . .
మేషరాశి: బుధుడు.. కుంభరాశిలో సంచరిస్తున్న సమయంలో మేష రాశి వారు గొప్ప విజయాన్ని పొంతుదారు. కేరీర్ పరంగా చాలా ఉన్నతస్థాయికి వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అధికంగా లాభాలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు... నూతర వ్యాపారాలు ప్రారంభించేందుకు ఇది అనుకూల సమయమని పండితులు చెబుతున్నారు. అనుకోకుండా కొన్ని ఖర్చులు ఏర్పడే అవకాశం ఉంది. వృత్తి పని చేసేవారికి ఆశాజనకంగా ఉంటుంది. ఆర్థిక విషయంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు. ఉద్యోగస్తులు అనుకున్న ప్రదేశానికి బదిలీ అవుతారు. ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రేమ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
వృషభ రాశి: కుంభరాశిలో బుధుడు సంచారం వలన ఈ రాశి వారికి కొన్ని అడ్డంకులు ఏర్పడే అవకాశాలున్నాయని పండితులు చెబుతున్నారు. ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో కొన్ని ప్రతికూల ఫలితాలు ఏర్పడుతాయి. ఆర్థిక విషయంలో కొంత పురోగతి ఉంటుంది. ఉద్యోగస్తుల విషయంలో ప్రశంసలు పొందినా.. మానసికంగా ఇబ్బంది పడతారు. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి . ఆరోగ్య పరంగా సీజనల్ వ్యాధులు అంటే పంటి నొప్పి.. కంటికి సంబంధించిన రుగ్మతలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది . ప్రేమ.. పెళ్లి విషయాలను వాయిదా వేసుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు.
మిథున రాశి: బుధుడు ... కుంభరాశిలోకి ఈ నెల 11 వ తేదీన ప్రవేశిస్తున్నాడు. దీని ప్రభావం వలన మిధున రాశి వారికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పెద్ద వ్యక్తులతో సంబంధాలు మెరుగుపడతాయి. ఈ కాలంలో ఈ రాశి వారు ఉల్లాసంగా... ఉత్సాహంగా గడుపుతారు. ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ఇది అనుకూల సమయం .ఆదాయంలో ఊహించని పెరుగుదల ఉంటుంది. వ్యాపారంలో విస్తరణ కొత్త భాగస్వామ్యాలకు అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగులు గుడ్ న్యూస్ వింటారు . ఉద్యోగస్తులు అదనపు బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ప్రేమ.. పెళ్లి విషయాలు అనుకూలంగా సాగిపోతాయి.
కర్కాటక రాశి: బుధుడు .. కుంభరాశిలో సంచరిస్తున్నప్పుడు కర్కాటక రాశి వారికి పనిభారం..ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. నిరుద్యోగులు అధికంగా కష్టపడాల్సి ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులు ఎవరితోను వాదన పెట్టుకోకుండా.. వారి పని వారు చేసుకోండి. ఆరోగ్య విషయంలో అనుకోని ఇబ్బందులు రావడంతో డబ్బు ఖర్చవుతుంది. ఊహించని నష్టాలు వచ్చే ప్రమాదం ఉన్నందున మీ ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
సింహరాశి: ఫిబ్రవరి 11 న కుంభరాశిలో బుధుడు ప్రవేశించడంతో ఈ రాశి వారు కెరీర్ పరంగా చాలా ఉన్నతస్థితికి చేరుకునే అవకాశాలునాయి. వ్యాపారస్తులు గణనీయమైన లాభాలను పొందుతారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆఫీసులో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో అధికంగా లాభాలు వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టేవారికి ఇది అనుకూల సమయం. అనుకోకుండా దూరపు ప్రయాణాలు చేస్తారు. కుటుంబసభ్యుల మధ్య సఖ్యత ఏర్పడటంతో మాసనికంగా సంతోషంగా గడుపుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి బుధుడు.. కుంభరాశిలో ఉన్న సమయం అనుకూలంగా సాగిపోతుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.
కన్యారాశి: ఈ రాశి వారికి బుధుడు.. కుంభరాశిలో ప్రవేశం అంత అనుకూలంగా ఉండదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. వ్యాపారస్తులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో ఇబ్బందులు ఏర్పడుతాయి. ఆరోగ్యపరంగా సమస్యలు.. మానసిక ప్రశాంతత లేకపోవడం వంటివి ఏర్పడుతాయి. ఈ రాశి వారు ఎవరితో ఎలాంటి వాదన పెట్టుకోవద్దు. ఆర్థికంగా ఇబ్బందులు పడినా... సమయానికి చేతికి డబ్బుఅందుతుంది. అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి. ప్రేమ.. పెళ్లి విషయాల్లో ప్రతికూల ఫలితాలుంటాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
తులారాశి: బుధుడు .... కుంభ రాశిలో సంచరించుట వలన తులారాశికి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ తో పాటు జీతం పెరిగే అవకాశం ఉంది. ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులకు కొత్తగాపెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం. వ్యాపారస్తులకు సకాలంలో పెట్టుబడులు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుతాయి.ప్రేమ.. పెళ్లి వ్యవహారాలు అనుకూలిస్తాయి.
వృశ్చికరాశి: బుధుడు.. కుంభరాశిలో ప్రవేశించే సమయంలో వృశ్చిక రాశి వారికి ప్రతికూల ఫలితాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. వృత్తిపరంగా ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాలు అంత ఆశాజనకంగా ఉండవని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యమైన వ్యవహారాలు, వ్యక్తిగత పనులు నిదానంగా పూర్త వుతాయి. ఆర్థిక విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఆరోగ్య పరంగా నరాల సమస్యతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సాదాసీదాగా సాగిపోతాయి.
ధనస్సురాశి: కుంభరాశిలో బుధుడు సంచారం వలన ఈ రాశి వారు అద్భుత ప్రయోజనాలు అందుకుంటారు. గత పెట్టుబడుల నుండి అనేక లాభాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారంలో కూడా పెరుగుదల చాలా ఉంటుంది. ఆర్థికంగా లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ మాటల్లో మాధుర్యం ఉంటుంది . మీ కుటుంబ సభ్యుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. ఆరోగ్యం కూడా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.ప్రేమ.. పెళ్లి విషయాలు కలసి వస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయంలో మీరే కీలకం అవుతారు. మీరు లేనిదే పనికాదు అన్న పరిస్థితులు ఏర్పడుతాయి. అన్ని విషయాలు గతంలో కంటె మెరుగుపడతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
మకరరాశి: కుంభరాశిలో .. బుధ గ్రహ సంచారంతో మిశ్రమ ఫలితాలు వస్తాయి. కేరీర్లో హెచ్చు తగ్గులుంటాయి. అయినా మీ పనితీరుతో అధికారులు బాగా సంతృప్తి చెందుతారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి.ఉద్యోగంలో అధికారులు మీ పనితీరుతో బాగా సంతృప్తి చెందుతారు. నిరుద్యోగులకు ఆశించిన జాబ్ వస్తుంది. ఆర్థికపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఆరోగ్య పరంగా, తక్కువ రోగనిరోధక శక్తి కారణంగా దంత మరియు కంటి సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
కుంభరాశి: కుంభరాశిలో బుధుడు సంచార సమయంలో ... ఈ రాశి వారు అద్భుతమైన లాభాలను పొందుతారు.వ్యాపారస్తులు ఊహాజనిత లాభాలను పొందుతారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. మీ పిల్లల ఆరోగ్యవిషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. తోటి ఉద్యోగుల నుంచి కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశాలున్నాయని జ్యోతిష్యశాస్త్రం ద్వారా తెలుస్తుంది.
మీనరాశి : కుంభరాశిలో బుధుడు సంచారము చేస్తున్నప్పుడు ఈ రాశి వారికి ఆకస్మికంగా ఖర్చులు పెరుగుతాయి. మితిమీరిన ఆత్మవిశ్వాసం వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులు ఉన్నతాధికారులతో మంచి సంబంధాలను కొనసాగించడానికి కష్టపడతారు. అయినా చివరకు అందరూ మిమ్మలనే ప్రోత్సహించాల్సిన పరిస్థితులు వస్తాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులు కూడా అలానే నిలిచిపోయే అవకాశం ఉంది. సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ వారం శుభవార్త వింటారు. వ్యాపారస్తులు కొత్తగా పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.