బుధగ్రహం .. శని సొంత రాశి మకరంలోకి ప్రవేశం.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే ...

బుధగ్రహం .. శని సొంత రాశి మకరంలోకి ప్రవేశం.. ఏ రాశి వారికి ఎలా ఉందంటే ...

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంతోషం, దాంపత్య జీవితం, తెలివితేటలు, వ్యాపారం వంటి వాటికి కారకుడిగా గ్రహాల రాకుమారుడు బుధుడుని భావిస్తారు. బుధ స్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తి జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది.  బుధుడు ధనుస్సు రాశి నుంచి శని సొంత రాశి అయిన మకర రాశిలోకి ఫిబ్రవరి 1 గురువారం  ప్రవేశించాడు. బుధుడు రాశి మార్పు పన్నెండు రాశుల మీద పడనుంది.జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ... ఈ సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇవ్వబోతుంది. మరి కొందరికి ఆరోగ్య రీత్యా సమస్యలు వస్తాయి. మరి ఏ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. . .

మేష రాశి: బుధుడు మేష రాశి పదో ఇంట్లో సంచరిస్తాడు. శక్తిమంతుడు, రోగగ్రస్తుడుగా ఉండటం వల్ల అధికారానికి సంబంధించిన పనుల్లో పురోగతి ఉంటుంది. పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి.  సోదరులు, సోదరీమణులు, స్నేహితుల మద్దతు లభిస్తుంది. ప్రత్యర్థి నుంచి ఒత్తిడి ఉంటుంది.  వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి.  చిన్న పని అయినా కూడా ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది.  ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త పడాలని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

వృషభ రాశి: బుధుడు తొమ్మిదో స్థానంలో ఉన్న ఇంట్లో సంచరించడం వల్ల అన్ని పనుల్లో అదృష్టం మీ వెంట ఉంటుంది.   వృత్తి, వ్యాపారాల్లో పురోభివృద్ధి ఉంటుంది. ధన సంబంధమైన పనుల్లో పురోగతి ఉంటుంది. మేధోపరమైన పనుల్లో పురోగతి ఉంటుంది. తండ్రి సహకారం లభిస్తుంది.  సంతానం వైపు నుంచి శుభవార్తలు అందుతాయి.

మిథున రాశి: ఆరోగ్యం, సంతోషాలకు కారకుడైన బుధుడు మిథున రాశి ఎనిమిదో ఇంట్లో సంచరించడం వల్ల మనోధైర్యం తగ్గుతుంది.  ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఆర్ధిక విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొద్దిగా ఒత్తిడి ఉంటుంది.

కర్కాటక రాశి: ఖర్చులు, శక్తి కారణంగా భావించే బుధుడు కర్కాటక రాశి ఏడో ఇంట్లో సంచరించడం వల్ల రోజువారీ ఉపాధి పెరుగుతుంది.  మానసిక ఆలోచనలు పెరుగుతాయి. భాగస్వామ్య పనుల్లో అప్రమత్తంగా ఉండాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. బలం, సామాజిక వృత్తం పెరుగుతాయి.  ప్రేమ సంబంధాల్లో విభేదాలు తలెత్తుతాయి.

సింహరాశి: లాభనష్టాలకి కారకుడైనందున సింహ రాశి ఆరో ఇంట్లో బుధుడు సంచరిస్తున్నాడు.  వ్యాపారస్తులకి కాస్త ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి.  డబ్బుకి సంబంధించిన పనుల్లో మరింత శ్రద్ధ అవసరం. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.  కుటుంబ పనులకి సంబంధించి ఒత్తిడి తలెత్తే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేస్తారు. .

కన్యా రాశి: ఈ రాశి ఐదో ఇంట్లో బుధుడు సంచరించడం వల్ల ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. బోధన, అభ్యాసనలో పురోగతి ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు.  మేధో సామర్థ్యం పెరుగుతుంది.ఆదాయ వనరులు పెరుగుతాయి.

తులా రాశి: బుధుడు నాలుగో ఇంట్లో సంచరిస్తాడు. అదృష్టం మీకు అన్ని వేళలా సహకరిస్తుంది. గృహంలో సంతోషం ఉంటుంది. వాహన సౌఖ్యం పెరుగుతుంది. ఆకస్మిక ఖర్చులు కూడా పెరుగుతాయి. ఛాతీలో కాస్త అసౌకర్యంగా ఉంటుంది.

వృశ్చిక రాశి: ఎనిమిదో ఇంట్లో బుధుడు సంచరిస్తాడు. శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి.  ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో అదృష్టం కలిసి వస్తుంది.వ్యాపారానికి సమయం అనుకూలంగా ఉంటుంది. తోబుట్టువులు, మిత్రులతో విభేదించే పరిస్థితి ఏర్పడుతుంది. 

ధనుస్సు రాశి: ధనుస్సు రాశి రెండో ఇంట్లో బుధుడు సంచరిస్తున్నాడు. జీవిత భాగస్వామి నుంచి ప్రయోజనం పొందే పరిస్థితి ఉంటుంది. వ్యాపారంలో ఉన్నవారికి ఇది అనుకూలమైన సమయం.   వ్యాపారంలో పురోగతి ఉద్యోగంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. ఆదాయం పెరుగుతుంది.

మకర రాశి: ఆరో ఇంట్లో బుధ సంచారం ఫలితంగా ఆరోగ్యానికి సంబంధించి ఒత్తిడి ఏర్పడుతుంది. మానసిక ఆలోచనలు పెరుగుతాయి. తండ్రి సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. రోజువారీ ఆదాయం బాగుంటుంది.

కుంభ రాశి:  కుంభ రాశి ఐదు, ఎనిమిదో ఇంట్లో బుధుడు సంచరిస్తాడు. ఫలితంగా పిల్లల వైపు నుంచి ఆందోళన కలిగే వాతావరణం ఏర్పడుతుంది. అకస్మాత్తుగా ఖర్చులు పెరుగుతాయి. సన్నిహితంగా ఉండే వ్యక్తి నుంచి ఒత్తిడి ఉంటుంది. చర్మ అలర్జీలు చికాకు పెడతాయి.

మీన రాశి:  గృహ, వాహన సౌఖ్యం పెరుగుతుంది. ప్రేమ సంబంధాలలో సానుకూల మార్పులు ఉంటాయి. రోజువారీ ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామి వైపు నుంచి ఆర్థిక సహాయం అందుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి.