మాజీ భార్య,కాబోయే భార్య మధ్య.. నలిగిపోయే భర్త కథ.. మేరే హస్బెండ్‌‌‌‌ కి బీవీ

మాజీ భార్య,కాబోయే భార్య మధ్య.. నలిగిపోయే భర్త కథ.. మేరే హస్బెండ్‌‌‌‌ కి బీవీ

అర్జున్ కపూర్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మేరే హస్బెండ్‌‌‌‌ కి బీవీ’. రకుల్ ప్రీత్ సింగ్, భూమి ఫెడ్రేకర్ హీరోయిన్స్. ‘పతి పత్ని ఔర్ వో’ ఫేమ్ ముదాస్సార్‌‌‌‌‌‌‌‌ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రకుల్ భర్త జాకీ భగ్నానీ దీన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే పోస్టర్స్‌‌‌‌తో ఆసక్తి పెంచిన మేకర్స్‌‌‌‌.. శనివారం ట్రైలర్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. ఇదొక రొమాంటిక్ కామెడీ మూవీ.  హాస్పిటల్ బెడ్‌‌‌‌పై స్పృహలోకి వచ్చిన భూమి ఫెడ్నేకర్‌‌‌‌..‌‌‌‌ రెట్రోగ్రేడ్ యామ్నీషియాతో గత ఐదారేళ్లలో తన జీవితంలో జరిగిందంతా మర్చిపోతుంది. 

అర్జున్ కపూర్‌‌‌‌‌‌‌‌తో తన ప్రపోజల్ తప్ప ఐదేళ్ల వివాహ జీవితం,  విడాకుల విషయం ఆమెకు గుర్తు లేదు. ఆమె స్పృహలోకి వచ్చిన రోజే  రకుల్‌‌‌‌కు ప్రపోజ్ చేసి పెళ్లికి రెడీ అవుతాడు హీరో.   గతం మర్చిపోయిన మాజీ భార్య, కాబోయే భార్య మధ్య నలిగిపోయే పాత్రలో అర్జున్‌‌‌‌ కపూర్ కనిపించాడు. లవ్, కామెడీ సీన్స్‌‌‌‌తో కట్ చేసిన ట్రైలర్ ఆద్యంతం నవ్వులతో ఆకట్టుకుంటుంది. ఫిబ్రవరి 21న సినిమా విడుదల కానుంది.