ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రానికి వస్తున్నాడు

ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రానికి వస్తున్నాడు
  • పనికిమాలిన పార్టీ  టీఆర్ఎస్
  • ప్రజలు మేల్కొండి.. ఎవరూ భయపడొద్దు.. నేను ఉన్నా
  • ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ 

హైదరాబాద్: రాహుల్ గాంధీ ఏ మొహం పెట్టుకుని తెలంగాణ పర్యటనకు వస్తున్నారని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. రైతుల బియ్యం నేను కొనను అని కేసీఆర్ చెప్పినప్పుడు రాహుల్ ఎక్కడున్నారని కేఏ పాల్ ప్రశ్నించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాలక, ప్రతిపక్షాలపై మండిపడ్డారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ అధికారుల తీరుపై కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎక్కడా లేదు.. రాష్ట్రంలో కూడా లేదు కాబట్టి.. జల పట్ల చిత్తశుద్ధి ఉంటే.. కాంగ్రెస్ పార్టీని మూసేసి ప్రజాశాంతి పార్టీలో కలిపేయండి.. బెంగాల్ లో  మమతా బెనర్జీ అడిగినట్లే నేనూ అడుగుతున్నా.. ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయండి.. రాష్ట్ర, జాతీయ కాంగ్రెస్ నాయకులందరూ ప్రజాశాంతి పార్టీలో కలసి పోండి... ఈసారి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తాం.. ప్రజలను ఆదుకుంటాం.. రైతుల కన్నీరు తుడుస్తాం.. నిరుద్యోగ సమస్య నిర్మూలిస్తాం.. పెట్టుబడిదారులకు, బిలియనీర్లకు సాయమే చేయకుండా పెట్టుబడులు నేను తీసుకువస్తానని కేఏ పాల్ స్పష్టం చేశారు. 
77ఏళ్ల కాంగ్రెస్, ఇతర పార్టీల పాలనను చూశారు.. ఇంతవరకు నేను లేను గనుక.. ఇంకో గతి లేదు కనుక.. కొనసాగారు.. ఇకపై అవసరం లేదు.. నేను వచ్చా.. నన్ను నమ్మి.. నిర్భయంగా రండి. ప్రజాశాంతి పార్టీలో చేరండి అని కేఏ పాల్ పిలుపునిచ్చారు. 
పనికిమాలిన పార్టీ  టీఆర్ఎస్
తనపై దాడి చేసి వేధించడమే పనిగా పెట్టుకున్న టీఆర్ఎస్ పార్టీ ఓ పనికిమాలిన పార్టీ అంటూ కేఏ పాల్ విసుర్లు విసిరారు. రైతులు పండించిన పంట మొత్తం కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పారు. దేశంలో రైతులతో ఎక్కువ డ్రామా ఆడుతోంది కేసీఆర్, కేటీఆర్ మాత్రమేనన్నారు.  నిన్నగాక మొన్న రైతుల కోసం గ్రామాలకు వెళుతుంటే.. గూండాలను పెట్టించి కొట్టించారని కేఏ పాల్ ఆరోపించారు.  
ఇకపై కష్టాలు వస్తే నాకు చెప్పుకోండి.. మీ బాధలు తీరుస్తానని కేఏ పాల్ సూచించారు. నేను చెబుతున్నా.. ఇప్పుడున్న పార్టీలు అన్నీ అవినీతి పార్టీలు అని చెబుతున్నా.. స్పందించండి.. ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 7 గంటలకు అందర్నీ కలుస్తున్నా..ప్రజాశాంతి పార్టీలో చేరిన వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తానని కేఏ పాల్ పేర్కొన్నారు. 

 

 

ఇవి కూడా చదవండి

అవసరం లేని టెస్టులు, సర్జరీలు చేస్తే వైద్యులపై చర్య

చైనా ఆసియా గేమ్స్ వాయిదా

అట్టహాసంగా ఏఆర్‌ రెహమాన్‌ పెద్ద కూతురు పెళ్లి