మార్కుల లెక్క తేలకుండానే మెరిట్ జాబితా విడుదల

  • స్టాఫ్ నర్స్‌‌ రిక్రూట్​మెంట్​లో టీఎస్‌‌పీఎస్సీ తీరు

హైదరాబాద్‌‌, వెలుగు: సర్వీస్ వెయిటేజీ, అకడమిక్ వెయిటేజీ మార్కుల గందరగోళాన్ని ఎటూ తేల్చకుండానే, స్టాఫ్ నర్స్‌‌ పోస్టుల రీరివైజ్డ్ మెరిట్‌‌ లిస్ట్‌‌ను టీఎస్‌‌పీఎస్సీ సోమవారం రిలీజ్ చేసింది. ఈనెల 25 నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్టు ప్రకటించింది. అర్హత ఉన్నా తమకు సర్వీస్, అకడమిక్ వెయిటేజీ మార్కులు కలపలేదని నర్సులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈనెల 15న రిలీజ్ చేసిన రివైజ్డ్ మెరిట్ లిస్ట్‌‌ను క్యాన్సిల్ చేసింది. రెండ్రోజుల క్రితం 53 మందికి, సోమవారం మరో 27 మందికి వెయిటేజీ మార్కులు కలిపింది.

కోర్టుకు వెళ్లాల్సిందే

సోమవారం కోఠిలోని పబ్లిక్ హెల్త్ ఆఫీసుకు వచ్చిన మంత్రి ఈటల రాజేందర్‌‌‌‌ ఎదుట నర్సులు తమ ఆవేదనం వ్యక్తం చేశారు. సర్టిఫికెట్లు అప్‌‌లోడ్ చేయలేదన్న సాకుతో, తమకు ఎలిజిబిలిటీ ఉన్నా మార్కులు కలపడం లేదని ఆయనకు వివరించారు. నోటిఫికేషన్‌‌ రూల్స్ ప్రకారం సర్టిఫికట్లు అప్‌‌లోడ్‌‌ చేయకపోతే, మార్కులు కలపడానికి వీల్లేదని మంత్రి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో కోర్టు ద్వారా వస్తేనే న్యాయం జరిగే చాన్స్‌ ఉందని వారికి వివరించారు.

 

ఇవి కూడా చదవండి 

నేటి నుంచి జేఈఈ మెయిన్​..తొలిసారిగా ప్రాంతీయ భాషల్లో రాసే అవకాశం

తెలంగాణ, ఏపీ ఇంటర్‌‌ బోర్డుల అధికారులపై హైకోర్టు ఆగ్రహం

ఏపీ నీళ్ల లెక్క సరిదిద్దాలె..కేఆర్ఎంబీకి తెలంగాణ లెటర్‌‌ 

ప్రాజెక్టులను తెలంగాణ అక్రమంగా కడ్తోంది..కృష్ణా బోర్డుకు ఏపీ సర్కారు ఫిర్యాదు