వడగాం చేరిన మెస్రం వంశీయుల పాదయాత్ర

ఆదిలాబాద్, వెలుగు: నాగోబా జాతర సందర్భంగా గంగాజలం కోసం కాలినడకన బయల్దేరిన మెస్రం వంశీయులు శనివారం ఇంద్రవెల్లి మండలం వడగాం చేరుకున్నారు. ఉదయం బట్టగూడ గ్రామంలో ఝరి దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి బయల్దేరిన పాదయాత్ర సాయంత్రం వడగ్రాం గ్రామానికి చేరుకుంది.   రాత్రి అక్కడ బస చేసిన మెస్రం వంశీయులు ఆదివారం ఉడుంపూర్ గ్రామానికి చేరుకోనున్నారు. ఈ నెల 17న మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని హస్తినమడుగు నుంచి గోదావరి జలంతో తిరిగి కేస్లాపూర్ కు 25న చేరుకుంటారు.