జన్నారం రూరల్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా సన్నిధి నుంచి గంగాజలం కోసం కాలినడకన బయల్దేరిన మెస్రం వంశీయులు శుక్రవారం ఉదయం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు గోదావరి నదికి చేరుకున్నారు.
అత్తమడుగులో పుణ్యస్నానాలు చేసి సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. సహపంక్తి భోజనాలు చేసిన తర్వాత ఝరిలో గంగాజలం నింపుకొని మధ్యాహ్నం కేస్లాపూర్‌కు తిరుగు పయనమయ్యారు. ఈనెల 28న మహా పూజతో నాగోబా జాతర ప్రారంభమవుతుందని మెస్రం తెగ పెద్ద వెంకటరావు పటేల్ తెలిపారు.