పాఠశాలలో సిబ్బంది నిరసన.. వంట చేసిన టీచర్లు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థుల సాయంతో ఉపాధ్యాయులు వంట చేశారు. పాఠశాల వంట సిబ్బంది సమ్మె చేపట్టడంతో ఉపాధ్యాయులే వంట చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ పాఠశాల ముందు వసతి గృహాల సిబ్బంది ధర్నాకు దిగారు. 

తమన్న పర్మినెంట్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం ఇస్తున్న వేతనం కూడా సమయానికి ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం  చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పర్మినెంట్ చేయడంతోపాటు పనికి తగిన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.