
‘ఫేస్‌బుక్ మెసెంజర్’, ‘వాట్సాప్’.. రెండూ వేరువేరు మెసేజింగ్ యాప్స్. రెండింట్లోనూ వేరుగా చాటింగ్ చేయాలి. కానీ, త్వరలో ఈరెండు ప్లాట్‌ఫామ్స్‌పై కలిపి ఒకేసారి చాటింగ్ చేసే ఫీచర్ రాబోతోంది. అదే ‘క్రాస్ చాట్’. ప్రస్తుతం ఉన్న ఫీచర్ ప్రకారం వాట్సాప్ నుంచి వాట్సాప్‌కు, మెసెంజర్ నుంచి మెసెంజర్‌కు మాత్రమే చాట్ చేయొచ్చు. కానీ ‘క్రాస్‌చాట్’ అందుబాటులోకి వస్తే, ‘మెసెంజర్ నుంచి వాట్సాప్‌కు, వాట్సాప్ నుంచి మెసెంజర్’కు చాట్ చేయొచ్చు. రెండు ప్లాట్‌ఫామ్స్ మధ్య కమ్యూనికేషన్‌ను ఈజీ చేసేందుకు ‘ఫేస్‌బుక్’ ఈ ఫీచర్ తీసుకొస్తోంది. సిగ్నల్ ప్రొటోకాల్ ద్వారా మెసేజెస్ ఎన్‌క్రిప్ట్, డీక్రిప్ట్ అవుతూ మెసేజెస్ ఫార్వార్డ్ అవుతాయి.