
న్యూఢిల్లీ: సాకర్ లెజెండ్ లియోనల్ మెస్సీ నేతృత్వంలోని ఫిఫా వరల్డ్ చాంపియన్ అర్జెంటీనా ఇండియాకు రానుంది. అక్టోబర్‌లో కేరళలోని కొచ్చిలో అర్జెంటీనా టీమ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనుంది. ఇండియాలో ఫుట్‌బాల్‌ను ప్రమోట్ చేసేందుకు ఆ జట్టుతో అధికారికంగా భాగస్వామ్యం కుదుర్చుకున్న హెచ్ఎస్‌బీసీ ఇండియా సంస్థ బుధవారం ఈ విషయం ప్రకటించింది.
మెస్సీతో కూడిన అర్జెంటీనా టీమ్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం ఇండియాకు వస్తోందని తెలిపింది. మెస్సీ ఇది వరకు 2011 సెప్టెంబర్‌లో ఇండియాకు వచ్చాడు. నాడు కోల్‌కతాలోని సాల్ట్‌లేక్ స్టేడియంలో వెనెజులాతో జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో బరిలో దిగాడు. ఆ పోరులో అర్జెంటీనా ఒక గోల్ తేడాతో విజయం సాధించింది.