47 ఏండ్ల తర్వాత కలుసుకున్రు

వరంగల్‌‌‌‌ జిల్లా వర్ధన్నపేట మండ‌‌‌‌లంలోని ఇల్లంద జ‌‌‌‌డ్పీ హైస్కూల్‌‌‌‌లో 1975– 76 బ్యాచ్‌‌‌‌ ఏడో తరగతి స్టూడెంట్లు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుమారు 47 ఏళ్ల త‌‌‌‌ర్వాత మళ్లీ కలుసుకొని యోగ‌‌‌‌క్షేమాలు అడిగి తెలుసుకుంటూ, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు.

అనంతరం తమకు చదువు చెప్పిన గురువులు దేవేందర్‌‌‌‌రావు, బాబురావు, కేశవరెడ్డిని పట్టు వస్త్రాలతో సన్మానించారు. కార్యక్రమంలో స్టూడెంట్లు అంజయ్య, నరేందర్‌‌‌‌రెడ్డి, సదానందం, సోమదాసు, వేణుగోపాల్‌‌‌‌రావు, సలేందర్‌‌‌‌రెడ్డి, రవీందర్‌‌‌‌రెడ్డి, సురేశ్‌‌‌‌, చంద్రశేఖర్ పాల్గొన్నారు.    

- వర్ధన్నపేట, వెలుగు