వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లోనూ మెటా ఏఐ చాట్‌బాట్ వచ్చేసింది. ఈ చాట్‌బాట్ బెంగాలీ, హిందీతో పాటు అనేక మల్టీపుల్ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఈ మూడు యాప్స్‌లో దీన్నెలా వాడాలంటే...
వాట్సాప్‌లో ఏఐ
వాట్సాప్ యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్డేట్ చేయాలి. యాప్ ఓపెన్ చేసి, న్యూ చాట్ ఆప్షన్ పైన రంగుల రింగ్ ఐకాన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి, కంటిన్యూ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి.
ఆ తర్వాత వాట్సాప్‌తో చాట్ చేసినట్టే ఏఐ చాట్‌బాట్‌తో మాట్లాడొచ్చు. ఇక్కడ ప్రాంప్ట్స్‌తో రకరకాల ప్రశ్నలు అడగొచ్చు.
ఇన్‌స్టాలో ఇలా..
ఇన్‌స్టాగ్రామ్‌లో కుడివైపు పైన ఉన్న మెసెంజర్ సింబల్ పక్కన ఉన్న సెండ్ ఆప్షన్ కనిపిస్తుంది. కుడివైపు పైన ఉన్న పెన్సిల్ గుర్తుపై క్లిక్ చేయాలి. తర్వాత క్రియేట్ ఏఐ చాట్ ఆప్షన్‌పై ట్యాప్ చేయాలి. ఆపై మెటా ఏఐని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రాంప్ట్ టైప్ చేసి సెండ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఫేస్బుక్లో...
ముందుగా చాట్ ఆప్షన్‌లోని పెన్సిల్ ఐకాన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ఏఐ చాట్‌ని ఎంచుకుని, మెటా ఏఐపై క్లిక్ చేయాలి. అప్పుడు ఇచ్చే ప్రాంప్ట్‌ల ప్రకారం మెటా ఏఐ చాట్‌బాట్ రియాక్ట్ అవుతుంది.