వాట్సాప్ లోకి AI వచ్చేసింది.. ఫీచర్ బాగుంది కానీ..

వాట్సాప్ లోకి AI వచ్చేసింది.. ఫీచర్ బాగుంది కానీ..

మన వాట్సాప్ లోకి AI.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది.. వాట్సా్ప్ యాప్ ఉన్న వారికి.. ఏఐ ఫీచర్ కనెక్ట్ అవ్వండి అనే మెసేజ్ వస్తుంది. వాట్సాప్ ఓపెన్ చేయగానే.. రైట్ సైడ్ కింద రెయిన్ బో కలర్ లో ఏఐ సింబల్ కనిపిస్తుంది. రెండు నెలలుగా వాట్సాప్ ఏఐ ఫీచర్ వస్తుంది అని కంపెనీ ప్రకటించింది. 2024 జూన్ 27వ తేదీ నుంచి వాట్సాప్ ఉన్న వారికి ఈ ఫీచర్ కనిపిస్తుంది.

ఇప్పటికే చాలా మంది వాట్సాప్ AI ఫీచర్ కనెక్ట్ అవుతున్నారు. ఎలా వర్క్ చేస్తుంది అనేది టెస్ట్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ అంటే.. డీటెయిల్డ్ మేసేజ్ పెడుతుంది ఏఐ. గుడ్ మార్నింగ్ రిప్లయ్ కు డేట్, మంత్, ఇయర్ ను చూపిస్తుంది. 

కొన్ని అంశాల్లో తప్పుడ చూపిస్తుందని నెటిజన్లు అంటున్నారు. తెలంగాణ సీఎం ఎవరు అని తెలుగులో ప్రశ్నిస్తే కేసీఆర్ పేరు చెబుతోంది వాట్సాప్ ఏఐ.. అదే ఇంగ్లీష్ లో హూ ఈజ్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అని ఇంగ్లీష్ లో ప్రశ్నిస్తే.. రేవంత్ రెడ్డి పేరు చెబుతోంది. ఇంగ్లీష్ వరకు బాగానే ఉన్నా.. తెలుగు భాషలో ప్రశ్నిస్తే తప్పులు వస్తున్నాయని కొంత మంది నెటిజన్లు స్క్రీన్ షాట్స్ పెడుతున్నారు. 

రాబోయే రోజుల్లో బెటర్ గా ఉండొచ్చే ఏమో చూడాలి.. వాట్సాప్ అంటేనే ఏది నిజం.. ఏది అబద్ధం అని క్రాస్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి.. దీంతో వాట్సాప్ ఏఐ ఎంత వరకు నిజాలు చెబుతుంది అనేది చూడాలి..