ఇకపై ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ ఫ్రీ కాదట.. నెలకు 14 డాలర్లు చెల్లించేలా కొత్త సబ్ స్ర్కిప్షన్ ప్లాన్ ను తెస్తుందట. సోషల్ మీడియా దిగ్గజాలు ఫేస్ బుక్,ఇన్స్టాగ్రామ్ ల మాతృ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు ప్లాట్ ఫారమ్ లో యాడ్ ఫ్రీ సదుపాయం అందించేందుకు వినియోగదారులను నెలకు 40 డాలర్లు వసూలు చేసే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. యూరప్ వినియోగదారులకు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ రెండు ప్లాట్ ఫారమ్ లకు కలిపి17 డాలర్ల సబ్ స్క్రిప్షన్ ప్యాకేజీని అందించనుంది.
వినియోగదారు సమ్మతి లేకుండా ఐరోపాలో నిర్దేశిత ప్రకటనల కోసం వ్యక్తిగత డేటాను మెటా ఉపయోగించడం గురించి EU నియంత్రకుల ఆందోళనలు వస్తున్న నేపథ్యంలో ప్రతిస్పందనగా ఈ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ లను తెస్తున్నట్లు తెలుస్తోంది.
యూరోపియన్ యూనియన్ (EU) వినియోగదారులకు త్వరలో మూడు ఆప్షన్లను ఇవ్వనుంది మెటా సంస్థ. 1. ప్రకటనలు లేకుండా వినియోగించకోసం చెల్లించడం. 2. వ్యక్తిగత ప్రకటనలతో ఈ రెండు ప్లాట్ ఫారమ్ లను కొనసాగించడం. 3. అంకౌట్లను క్లోజ్ చేయడం. అంటే దీనర్థం.. సబ్ స్క్రిప్షన్ తప్పనిసరి అని. అయితే Meta EUలో ప్రకటనలతో తన యాప్‌ల ఉచిత వెర్షన్‌లను అందించడం కొనసాగిస్తుంది.