కొత్త ఏడాదిలోనూ ఉద్యోగాల కోత తప్పడం లేదు. టెక్ దిగ్గజం మెటా భారీగా ఉద్యోగుల ఏరివేతకు సిద్ధమైంది. లక్షల్లో జీతాలు తీసుకుంటూ పని చేయకుండా తప్పించు తిరుగుతున్న వారిని బయటకు సాగనంపనుంది. తక్కువ పనితీరు కనబరుస్తున్న వారిని గుర్తించినట్లు, వారి స్థానాలను కొత్త వారితో భర్తీ చేయనున్నట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది.
ALSO READ | ఇన్ఫోసిస్ చీఫ్ చెప్పినా మనోళ్లు వినట్లే.. వారానికి 46 గంటలే పని చేస్తున్నరు
మొత్తం 3,600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు బ్లూమ్‌బర్గ్ నివేదించింది. పనితీరు సామర్థ్యాన్ని పెంచే క్రమంలో తక్కువ పనితీరు కనబరుస్తున్నవారిని తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు జుకర్‌బర్గ్ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల మొత్తం 5 శాతం ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్.. మూడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు మెటా యజమాన్యానివే. ఈ మూడింటిలోనూ ఈ కోతలు ఉండనున్నాయి. గత సెప్టెంబర్ నాటికి మెటాలో దాదాపు 72,400 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 3600 మంది కొత్త ఉద్యోగాలు వెతుక్కోవలసిందే.
ఇటీవల కాలంలో పనితీరు-ఆధారిత తొలగింపులు అనేవి కామన్ అయిపోయింది. గత వారం టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇదే విధమైన కోతలను ప్రకటించింది.