అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు భారీ జరిమానా చెల్లించింది ఫేస్బుక్, ఇన్ స్ట్రాగ్రామ్ మాతృసంస్థ అయిన మెటా. 2021లో డొనాల్డ్ ట్రంప్ వేసిన పరువు నష్టం కేసులో సెటిల్ మెంట్ కు వచ్చిన మెటా డొనాల్డ్ ట్రంప్ లో జరిమానా చెల్లించేందుకు బుధవారం ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం డొనాల్డ్ ట్రంప్ కు రూ. 216 కోట్ల జరిమానా చెల్లించనుంది.
వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. మెటా కంపెనీ మొత్తం 25 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఇందులో $22 మిలియన్లు ట్రంప్ ప్రెసిడెన్షఇయల్ ఖాతాకు విరాళంగా ఇస్తారు. సెటిల్‌మెంట్ వివరాలను మెటా ప్రతినిధి కూడా ధృవీకరించారు.
2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలు ట్రంప్ ఖాతాను తొలగించాయి. ఎన్నికల్లో ఓడిగొట్టేందుకు ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా సంస్థలు ప్రయత్నించాయని 2021 జనవరి6న డొనాల్డ్ ట్రంప్ కోర్టులో పరువు నష్టం లాసూట్ దాఖలు చేశారు.
మెటాపై కంటే ముందు అనేక మీడియా సంస్థలు, టెక్ కంపెనీలపై కూడా ట్రంప్ పరువు నష్టం దావా వేశారు. జీన్ కారోల్ కేసులో ట్రంప్ పై సివిల్ తీర్పు గురించి యాంకర్ జార్జ్ స్టెఫానో పౌలోస్ అభ్యంతర కర వ్యాఖ్యలు చేశారని ABC న్యూస్ పై లాసూట్ దాఖలు చేశారు. దీంతో ఆ మీడియా సంస్థ ట్రంప్ కు 15 బిలియన్ డాలర్లు చెల్లించింది. దీంతోపాటు ఈ న్యూస్ నెట్‌వర్క్ $1 మిలియన్ లీగల్ ఫీజుగా కూడా చెల్లించింది.
ట్రంప్ CBS న్యూస్ ,ది డెస్ మోయిన్స్ రిజిస్టర్‌పై కూడా పరువు నష్టం దావా వేవారు. తన ఎన్నికల ప్రచారాన్ని తప్పుదోవ పట్టించాని ట్రంప్ ఆరోపించారు. రెండు మీడియా సంస్థలు ట్రంప్ ఆరోపణలను ఖండించాయి.